బిగ్ బాస్6 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా సుధీర్.. ఫ్యాన్స్ కు పండగే అంటూ?

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో గత సీజన్ల తరహాలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్న సంగతి తెలిసిందే.

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియలో జరిగిన తప్పులే బిగ్ బాస్ షో పూర్ రేటింగ్స్ కు కారణమని కొంతమంది అనుకుంటున్నారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్6 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా సుధీర్ ఎంట్రీ ఇవ్వనున్నారు.సుడిగాలి సుధీర్ కు సైతం బిగ్ బాస్ షో అంటే ఆసక్తి ఉంది.

సుడిగాలి సుధీర్ ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నారని త్వరలో ఈ షోలో సుధీర్ ప్రత్యక్షం కానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో సుడిగాలి సుధీర్ ఈ షోకు నో చెప్పలేకపోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

యాంకర్ గా, కమెడియన్ గా సుడిగాలి సుధీర్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది.సుడిగాలి సుధీర్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.

Advertisement

సుడిగాలి సుధీర్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే మాత్రం ఆ సందడి మామూలుగా ఉండదు.గత కొంతకాలంగా సుధీర్ ఏ షోలో కనిపించడం లేదు.

జీ తెలుగు ఛానల్ లో ఒక ఈవెంట్ లో సుధీర్ కనిపిస్తున్నా ఆ షోకు సుధీర్ గెస్ట్ గా మాత్రమే హాజరయ్యారనే సంగతి తెలిసిందే.సుధీర్ కంటిన్యూగా చేసే షోలు అయితే లేవు.

బిగ్ బాస్ షోకు వెళ్లడం వల్ల సెలబ్రిటీలు ఆర్థికంగా కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంది.సుధీర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాతైనా బిగ్ బాస్ షో ఫేట్ మారతారేమో చూడాల్సి ఉంది.సుధీర్ బిగ్ బాస్ షోలో కనిపించనున్నారని తెలిసి ఆయన ఫ్యాన్స్ లో కొంతమంది తెగ సంతోషిస్తున్నారు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు