Bigg Boss Akhil Sarthak : ట్రోలర్స్ పై మండిపడిన బిగ్ బాస్ అఖిల్.. మీకు దమ్ముంటే హౌస్ లోకి వెళ్ళండి అంటూ?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) రసవత్తరంగా సాగుతోంది.ఇటీవల మొదలైన బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే నాలుగు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా ఐదవ వారంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

 Bigg Boss Runner Akhil Sarthak Comments Trollers-TeluguStop.com

అయితే బిగ్బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు వరుసగా నలుగురు లేడీ కంటెస్టెంట్ లు ఎలిమినేట్( Lady Contestants Eliminate ) అయిన విషయం తెలిసిందే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్‌ నుంచి బయటకొచ్చేశారు.ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది.

అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై మాములుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి.

Telugu Akhil Sarthak, Bigg Boss, Biggboss, Netizens, Trollers-Movie

అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు.అయితే ఈసారి రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్‌ను చూపిస్తున్నాడు.అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌కు మాట్లాడుతున్న బిగ్‌బాస్‌ సీజన్-4 రన్నరప్ అఖిల్‌ సార్థక్( Akhil Sarthak ) మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో స్ట్రాంగ్ గా వార్నింగ్ కూడా ఇచ్చాడు.మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్‌ను చూపించాలంటూ ఒక రేంజ్ లో మండిపడ్డాడు.

ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్‌లో ఉన్నప్పుడే చాలా చూశాను అని చెప్పుకొచ్చాడు.అయితే హౌస్‌లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్‌( Pallavi Prashanth )పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.

వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్‌ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు.తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Telugu Akhil Sarthak, Bigg Boss, Biggboss, Netizens, Trollers-Movie

అఖిల్ మాట్లాడుతూ.నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్.నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు.

నాపై నెగెటివ్ కామెంట్స్( Negative Comments ) చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్.వీటిని అస్సలు పట్టించుకోను కూడా.

ప్రశాంత్‌ రన్నర్‌ అయినా, విన్నర్‌గా నిలిచినా సంతోషిస్తా.దానికంటే నాకు సంతోషం ఏమి లేదు.

సీజన్‌-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు.కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి.

డిఫరెంట్‌గా ట్రోలింగ్‌ చేస్తే బాగుంటుంది.నన్ను రెండుసార్లు రన్నర్‌ అంటున్నారు.

అరే మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి.ప్రశాంత్‌ హౌస్‌లోకి వెళ్లి గేమ్ క్లియర్‌గా ఆడుతున్నాడు.

మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి.నాకెలాంటి ఇబ్బంది లేదు.

అలాగే సీజన్‌-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్ అంటూ పోస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube