తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక( Rathika ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షోతో( Bigg Boss ) బీభత్సమైన పాపులారిటీని సంపాదించుకుంది రతిక.
మొదట బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అదృష్టవశాత్తు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో అంతో ఇంతో బాగుంది,అందంగా ఉన్న అమ్మాయి ఎవరు అంటే అది రతిక అని చెప్పవచ్చు.
మిగతా విషయాలు పక్కన పెడితే గ్లామర్ విషయంలో రతిక బెస్ట్ అని చెప్పవచ్చు.మొదటిసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన అందంతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
పేరుకు తగ్గట్టుగానే ఈమె చాలా అందంగా ఉంది.ఆమె కురులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఉంటాయి.అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా.అసలు విషయంలోకి వెళితే.ప్రస్తుతం సోషల్ మీడియాలో రతికది అసలైన జుట్టు కాదు సవరం అంటూ కొన్ని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రతిక జుట్టు( Rathika Hair ) మనకి కుచ్చులా భలే ఒత్తుగా కనిపిస్తుంది కానీ అది ఆమె ఒరిజినల్ కాదు.సవరం( Hair Wig ) పెట్టుకుని మ్యానేజ్ చేస్తుందన్నమాట.
రాత్రి పూట అందరూ పడుకున్న తరువాత తన సవరాన్ని తీస్తుండగా, బిగ్ బాస్ కనిపెట్టేసి లైవ్ ఎపిసోడ్‌లో బయటకు వదిలేశాడు దీంతో రతిక హెయిర్ ప్యాచప్ వీడియో వైరల్ అవుతోంది.
అయితే మాములుగా బిగ్ బాస్ ఆటకి బలైన కంటెస్టెంట్స్ ప్రతి సీజన్ లోనూ ఉంటారు.అయితే ఈ సీజన్‌లో అడ్డంగా బలైన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది రతికానే అని చెప్పవచ్చు.ఆమెను ఎన్ని విధాలుగా బ్యాడ్ చేయాలో అన్ని విధాలుగా బ్యాడ్ చేసాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ సగం ఆమెను బ్యాడ్ చేస్తే ఆమె కూడా తను చేసిన పనిలో వల్ల కూడా బ్యాడ్ అయ్యింది.పల్లవి ప్రశాంత్‌తో( Pallavi Prasanth ) లవ్ ట్రాక్, మాజీ ప్రియుడు రాహుల్ సిప్లింగంజ్( Rahul Sipligunj ) ఫొటోలు లీక్, ప్రశాంత్‌ని రెచ్చిగొట్టి వెనకెనుకే తిప్పించుకుని చివర్లో ఎవడ్రా నువ్వూ అంటూ ఏటేసినట్టుగా పొడిచిన పోటు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు.
ఇవన్నీ కూడా రతిక క్యారెక్టర్‌ని ఫుల్ డ్యామేజ్ చేసిపారేశాయి.