Priyanka Singh : తప్పుగా అనుకున్న తప్పదు…ఇది నా జాబ్ ప్రియాంక  సింగ్ కామెంట్స్ వైరల్!

జబర్దస్త్ ( Jabardasth ) కార్యక్రమంలో లేడీ పాత్రలలో నటిస్తూ అందరిని ఎంతో సందడి చేసినటువంటి వారిలో సాయి ఒకరు.లేడీ గెటప్స్ లో నటిస్తూ ఏకంగా అమ్మాయిగా మారాలని కోరిక కలగడంతో సర్జరీ చేయించుకొని మరీ అమ్మాయిగా మారిపోయారు.

 Bigg Boss Priyanka React On Negative Trolls-TeluguStop.com

ఇలా సాయి( Sai ) గా ఉన్నటువంటి ఇతను ప్రియాంక సింగ్ గా మారిపోయారు.ప్రస్తుతం ప్రియాంక సింగ్( Priyanka Singh ) కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా కొనసాగుతున్నారు.

ట్రాన్స్ జెండర్ అయినటువంటి ఈమె బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియాంక సింగ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో భారీ స్థాయిలో గ్లామర్ షో చేస్తున్నారు.తరచు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె ఇటీవల బాత్ టబ్ లో చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే ఈ ఫోటోలపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి ఇలా తన గురించి నెగిటివ్ కామెంట్లు చేయడంతో ఆ ఫోటోలను చేయడం వెనుక కారణాలను ఈమె తెలియజేశారు.

తాను షేర్ చేసినటువంటి ఫోటోలు ఒక ప్రైవేట్ సాంగ్లో భాగంగా తీసినవని ఈమె తెలియజేశారు.ఈ ఫోటోలపై చాలా నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి.ఇకపోతే నేను ఏం చేసినా తప్పు అని భావిస్తున్నారు.ఇది నా జాబ్ మీరు మీ పనులలో ఎలా అయితే బిజీగా ఉంటున్నారో నేను కూడా నా పనిలో బిజీగా ఉన్నాను మీరు తప్పు అనుకున్న నాకు తప్పదు ఎందుకంటే ఇది నా వృత్తి అంటూ ఈ సందర్భంగా ప్రియాంక సింగ్( Priyanka Singh )చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇది నేను చేస్తున్న ఫస్ట్ ప్రైవేట్ సాంగ్ ఇది మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను అంటూ ఈమె అసలు విషయం వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube