దిగజారిపోయావు అరియనా అంటూ నటరాజ్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో ట్రోల్!

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.ఇటీవలే మొదలైన బిగ్ బాస్ షో అప్పుడే ఎనిమిది వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది.17 మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు.ఇప్పటికే బిగ్బాస్ హౌస్ నుంచి ఎనిమిది మంది కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు.9వ వారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ లో రచ్చ రచ్చ జరిగింది.ఇక తాజాగా నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఒక టాస్క్ ని ఇచ్చాడు.

 Bigg Boss Non Stop Ariyana Glory Vs Natraj Master In Ninth Week Nominations Deta-TeluguStop.com

దిష్టి బొమ్మలు పెట్టి వాటిపై కుండలు పెట్టి బ్యాట్ తో బద్దలుకొట్టి అలా నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో భాగంగానే ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక కారణాలు చెబుతూ కుండ బద్దలు కొట్టారు.

ఈ క్రమంలోనే పరువు కంటెస్టెంట్ ల మధ్య రచ్చ రచ్చ జరిగింది.మరీ ఎక్కువగా నట్రాజ్ మాస్టర్, అరియానా ల మధ్య అయితే పెద్ద యుద్ధమే జరిగింది.

మొదట అరియానా నట్రాజ్ మాస్టర్ ను నామినేట్ చేసింది.ఆ తరువాత మొన్న గేమ్ ఆడుతున్నపుడు హమీదా యాంకర్ శివతో కలిసి స్ట్రాటజీ చేస్తుందని కంఫార్మ్ చేశారని, ఆ స్ట్రాటజీ ఏమిటి అని అరియానా అడగగా అది ఏమిటో చెప్పలేదు,కానీ ఆమెకు స్ట్రాటజీ ఉందని అందరికీ చెప్పారని పేర్కొంది.

అలా చేస్తున్నావా అని అడిగితే ఆమె లేదని చెప్పిందని అంటే ఆమె ఏమీ చేయకపోయినా మీరు మా మనస్సులో ఆమె గురించి వేరే ఆలోచనలు రేకెత్తించారు అని అరియానా అనగా, అప్పుడు నటరాజ్ మాస్టర్ బాగుంది.

Telugu Anchor Shiva, Ariyana, Bigg Boss, Biggboss, Hameedia, Nataraj Master-Movi

రోజంతా కుర్చుని బాగా ప్లాన్ చేసావ్ అంటూ కామెంట్ చేస్తూ, నీ ఫేవరెట్స్ ఎవరినీ చేయకుండా భలే దొరికాడు వీడు అని నామినేట్ చేశావని అనడంతో పాటు అరియానా ని నువ్వు స్వార్థపూరిత విషమని అన్నాడు.దీంతో అరియానా కోపంతో మీరు మొదటి వారం నుంచి నాకు సపోర్ట్ చేస్తారని అన్నారని కానీ ఎప్పుడూ చేయలేదని పేర్కొంది.అంతేకాదు ఎందుకు ముందు నుంచి మీ మీద డిపెండ్ అయ్యేలాగా చేస్తున్నారు.

నేను ఎందుకు మీ మీద డిపెండ్ అవ్వాలి అంటూ ప్రశ్నించింది.అయితే భలే ప్లాన్ చేశావులే ఇక వెళ్ళు అంటూ నటరాజ్ మాస్టర్ ఎప్పటిలాగే రెచ్చ కొట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube