బిందు ఎఫెక్ట్.. కంటెస్టెంట్ల ప్లేస్ లు తారుమారు.. అసలేం జరిగిందంటే?

తాజాగా హౌస్ లో బాబా భాస్కర్ పొద్దు పొద్దున్నే అరియానా పై సెటైర్లు వేయడంతో అరియానా ఒక్కసారిగా ఏడ్చేసింది.పో.

 Bigg Boss Non Stop Show Contestant Shiva Top Place On Task Details, Bigg Boss N-TeluguStop.com

పో వమ్మా.ఉండేది శనివారం వరకే కదా.ఎలాగూ వెళ్లిపోతావ్ అంటూ జోక్‌లు వేసాడు.ఆ తరువాత నట్రాజ్ మాస్టర్ తన వైపు కూడా చూడటం లేదు అంటూ అఖిల్ అరియానా కి చెప్పుకుని బాధపడ్డాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఎనిమిది మందికి టైం కార్డ్స్ ఇచ్చి, ఆ టైం కార్డ్స్ లో వివిధ నిమిషాలు రాసి ఇంటి సభ్యులందరూ కలసి ఏకాభిప్రాయంతో ఎక్కువ నిమిషాలు ఉన్న బోర్డులను తొలగించాలని ఆదేశించాడు బిగ్ బాస్.

అలా అయితే మొత్తంగా 60 నిమిషాల వ్యవధిలో ఉన్న ఎనిమిది మందిలో యాంకర్ శివ పెర్ఫామెన్స్ బెస్ట్‌గా ఉంటుందని ఇంటి సభ్యులు చెప్పడంతో కెప్టెన్సీ కంటెండర్ అయిన వాళ్లకంటే కానీ వాళ్లే ఎక్కువ చేశారు.

ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఆ 15 మినిట్స్ తనకే రావాలి అంటూ వాదించింది బిందు మాధవి.అంతేకాదు ఇప్పటి వరకూ శివ వల్ల తనకి ఏం ఉపయోగం కలిగిందో చెప్పాలి అంటూ ఎలా అయినా ఆ 15 మినిట్స్ బోర్డ్ తనకే రావాలి అని తెలిపింది బిందు.

బాబా భాస్కర్ కూడా శివ పేరు చెప్పడంతో.నేను ఎందుకు లేను.

అని వాదించింది బిందు.ఆ తరువాత ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో శివకి 15 మినిట్స్ బోర్డ్ ఇవ్వాలని డిసైడ్ కావడంతో.

బిందు మాత్రం నేను ఓటు వేయకపోతే ఏకాభిప్రాయం కాదు.ఆ 15 నిమిషాల బోర్డు నీకు ఎందుకు ఇవ్వాలి.

నీకు ఓటు ఎందుకు వేయాలో చెప్పు అంటూ శివని అడిగింది బిందు మాధవి.

Telugu Akhil, Anchor Siva, Ariyana, Bababhaskar, Bigg Boss, Biggboss, Bindhu Mad

అలా వారిద్దరు వాదించుకుంటూ ఉండగా అప్పుడు నీ నోటి దూల వల్లే నాకు 15 నిమిషాల బోర్డ్ కావాలంటే వెళ్లి తీసుకో అని బిందు అనడంతో ఏదో ఒక దూలలే అని వెళ్లి 15 నిమిషాల బోర్డ్ మెడలో వేసుకున్నాడు శివ.అయితే బిందు మాధవి తనకి 15 నిమిషాలు కావాలి అది కుదరదు అన్నారు కాబట్టి.1.30 నిమిషాలు బోర్డ్ కావాలి అని చెప్పి ఆ బోర్డ్ తీసుకుంది.అలా చివరికి బిందుకి 1.30 నిమిషాల బోర్డుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అలా ఈ టాస్క్ లో మొదటి స్థానం కోసం పోరాడి చివరి స్థానాన్ని దక్కించుకుంది బిందుమాధవి.

ఇక మొదటి స్థానాన్ని యాంకర్ శివ సంపాదించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube