తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.కంటెస్టెంట్ ల మధ్య పోటీ గట్టిగానే నడుస్తోంది.
గతంలో ఎన్నడూ లేనివిధంగా కంటెస్టెంట్ నువ్వానేనా అన్నట్టుగా పోటీపడుతూ, బూతులతో రెచ్చిపోతున్నారు.అంతేకాకుండా బిగ్ బాస్ పెట్టిన రూల్స్ నీ పాటించకుండా ఎవరికి తోచిన విధంగా టాస్క్ లో ఆడుతూ రచ్చరచ్చ చేస్తున్నారు.
ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలోకి అఖిల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.బిగ్ బాస్ నాన్ స్టాప్ లోకి అఖిల్ టైటిల్ ఫేవరెట్ గా అడుగుపెట్టాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం నుంచే బిగ్ బాస్ కంటెస్టెంట్ హీరోయిన్ బిందు మాధవికి గట్టిగా పోటీ ఇవ్వడం మొదలుపెట్టాడు.
అలా క్రమంగా బిందుమాధవి కూడా టైటిల్ ఫేవరెట్ గా కూడా మారిపోయింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో అఖిల్, బిందు మాధవిలు మొదటి వారం నుండే నామినేషన్స్ లో పోటీపడుతూ వస్తున్నారు.వీరిద్దరి విషయంలో మొదటి నుంచి గొడవ జరిగిన ప్రతిసారీ కూడా అక్కడి బిందుమాధవి హైలెట్ గా నిలుస్తోంది.
అదేవిధంగా ఓటింగ్ విషయంలో కూడా బిందు మాధవికి ఎక్కువ ఓట్లతో అఖిల్ కు ప్రతి వారము కూడా షాక్ ఇస్తోంది.ఈవారం కూడా బిందుమాధవి, అఖిల్ నామినేట్ అయినప్పటికీ బాబా భాస్కర్ బిందు మాధవిని సేవ్ చేసి అఖిల్ కు షాక్ ఇచ్చాడు.

ఇకపోతే ఈ వారం యాంకర్ శివ కెప్టెన్ అప్పడం, అదేవిధంగా బిందుమాధవి నామినేషన్స్ లో లేకపోవడంతో వారిద్దరి ఓట్స్ అఖిల్ కి షేర్ అవుతాయని తెలుస్తోంది.మరి ఈ సారి కూడా అఖిల్ కు మళ్ళీ షాకె.అదేవిధంగా ఈ వారం మిత్రశర్మ కూడా నామినేషన్స్ లో లేదు.ఇక ఈ వారం నామినేషన్స్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన అఖిల్, అషు రెడ్డి, అనిల్, హమీద, అజయ్ లు ఉన్నారని, ఓటింగ్ లో మొదటి స్థానంలో అనిల్, సెకండ్ ప్లేస్ లో అఖిల్ ఉండగా మూడో ప్లేస్ లో హమీద ఉన్నట్లుగా తెలుస్తుంది.
తర్వాత స్థానాల్లో అషు, అజయ్ లు ఉన్నారు.మరి ఈ వారం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి షాక్ తగలడం ఖాయం అని అంటున్నారు.







