బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్( Bigg Boss ) రియాలిటీ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్ లో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పాలి.ఇలా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారందరూ కూడా హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారిలో డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ ( Gautham Krishna ) ఒకరు.ఈయన హౌస్ లోకి కొనసాగుతూ తన ఆట తీరుతో తన మాట తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇక ఈ కార్యక్రమం తర్వాత గౌతమ్ కృష్ణ సినిమా అవకాశాలను అందుకున్నారు.తాజాగా ఈయన హీరోగా తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.ఈ కార్యక్రమం తర్వాత హీరోగా అవకాశాలు అందుకున్నటువంటి సినిమాని ప్రకటిస్తూ తన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కొత్త దర్శకుడు పి నవీన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

ఇలా కొత్త దర్శకుడు దర్శకత్వంలో గౌతమ్ నటిస్తున్నటువంటి ఈ సినిమాకు సోలో భాయ్ ( Solo Bhai ) అనే టైటిల్ ఫిక్స్ చేశారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయగా ఇది కాస్త వైరల్ గా మారింది.ఇందులో గౌతం కృష్ణ లుక్ ఎంతో అద్భుతంగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఈ పోస్టర్ లో గౌతమ్ చేతికి బ్యాగ్ వేసుకొని అందరిలో కలిసి నడుస్తూ వెళ్తున్నట్టు కనిపించారు.
మరి ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం గురించి తెలియదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం అందరిని ఆకట్టుకుంది.
.






