తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారమవుతూ చివరి దశకు చేరుకుంది.
మరొక రెండు రోజులలో 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరి దశకు రావడంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.అదేవిధంగాఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ లో చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరు కానున్నారు అనే విషయం గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతుంది.
ఈ క్రమంలోని బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా నిర్వహించడానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.ఇకపోతే గత సీజన్లో ఈ కార్యక్రమ గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా ఎవరూ రాలేదు.
హోస్ట్ నాగార్జుననే విజేతను ప్రకటించారు.ఇకపోతే మూడు నాలుగు సీజన్లలో ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరై పెద్ద ఎత్తున సందడి చేశారు.
ఇకపోతే సీజన్ సిక్స్ కోసం కూడా బిగ్ బాస్ నిర్వాహకులు స్టార్ హీరోని ఆహ్వానించినట్టు సమాచారం.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నందమూరి నరసింహ బాలకృష్ణను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్టు తెలుస్తోంది.బాలకృష్ణ ఇన్ని రోజులు కేవలం హీరోగా మాత్రమే వ్యవహరించారు.అయితే ఈయన కూడా ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
ఇలా ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న బాలకృష్ణను బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి బాలయ్య చేతుల మీదుగానే విజేతను ప్రకటించి, ఆయనకు ట్రోఫీ అందించనున్నారని సమాచారం.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాలి.







