ఉర్ఫీ జావెద్ క్రియేటివ్ డ్రెస్.. ఒక్క వైరు ఉడిపోయినా పరువు పోవడం ఖాయం?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచుగా సోషల్ మీడియాలో నిలవడమే కాకుండా ట్రోలింగ్స్ కి గురవుతూ ఉంటుంది.

 Bigg Boss Fame Urfi Javed In Wire Outfit,urfi Javed, Wire Outfit,viral,social Me-TeluguStop.com

తన వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ డిఫరెంట్‌ ఫ్యాషన్‌ వేర్‌తో ఎన్నోసార్లు ట్రోల్స్‌ బారిన పడిన విషయం మనందరికి తెలిసిందే.అయితే ఎవరు ఏమి అన్న కూడా పట్టించుకోకుండా రోజుకో వేషధారణలో దర్శనమిస్తుంటుంది.

ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎక్కువ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది.ఎక్కువగా చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్‌.
మొదట బడే భయ్యాకి దుల్హానియా సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ఆ తర్వాత చంద్ర నందిని, మేరీ దుర్గా, జీజీ మా, దయాన్, ఏ రిస్తా క్యా కహతా హై లాంటి సీరియల్స్‌లో నటించింది నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే ఈమెకు ఇంస్టాగ్రామ్ లో మిలియ‌న్ల కొద్దీ ఫాలోవ‌ర్స్ ఉన్న విషయం తెలిసిందే.

విచిత్ర‌మైన డ్రెస్సులు వేసుకొని గ్లామ‌ర్ ఒల‌క‌బోసే ఉర్ఫీకి సోష‌ల్ మీడియాలో బాగానే క్రేజ్ ఉంది.ఆమె వేసుకున్న డ్రెస్సుపై నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు.

అయిన‌ప్ప‌టికీ త‌గ్గేదే లే అన్న‌ట్టు వెరైటీ డ్రెస్సుల‌లో మెరుస్తూ ఉంటుంది ఉర్ఫీ.

తాజాగా వైర్ల‌తో డ్రెస్ ధ‌రించి అందాలు ఆర‌బోసింది.అందులో బట్టలకు బదులుగా కేవలం వైర్ల ను మాత్రమే డ్రెస్ రూపంలో ధరించి రెచ్చిపోయింది.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బాబోయ్ ఉర్ఫీని ఇలా చూసి కుర్రాళ్లు థ్రిల్ అవుతున్నారు.రానురాను ఉర్ఫీ అరాచ‌కం ఓ రేంజ్‌లో ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

ఎవరు ఎన్ని మాటలు అన్న కూడా తన లైఫ్ స్టైల్ ని మాత్రం మార్చుకునేది లేదు అని అంటుంది ఉర్ఫీ జావెద్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube