'జైలర్' పై 'బిగ్ బాస్' ప్రభావం..టీఆర్ఫీ రేటింగ్స్ అంత తక్కువ రాబోతోందా?

దీపావళి పండుగ రోజు టీవీ లో ఆడియన్స్ కి ఒక మినీ ఫెస్టివల్ నడిచింది అనే చెప్పాలి.ఒకపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘జైలర్’ చిత్రం జెమినీ టీవీ లో ప్రసారం కాగా, మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7( Bigg Boss Season 7 ) స్పెషల్ దీపావళి ఎపిసోడ్ కూడా ప్రసారం అయ్యింది.

 'bigg Boss' Effect On 'jailer'..trp Ratings Are Going To Be So Low , Bigg Boss-TeluguStop.com

జనాలకు ఏది చూడాలో అర్థం కాలేదు.బ్రేక్ వచ్చే వరకు జైలర్ చూసే వాళ్ళు కొంత మంది, బ్రేక్ తర్వాత బిగ్ బాస్ చూసే వాళ్ళు కొంతమంది.

కానీ ఎక్కువ శాతం ఆడియన్స్ మాత్రం బిగ్ బాస్ ని చూసినట్టు గా తెలుస్తుంది.బిగ్ బాస్ ప్రభావం ‘జైలర్’ చిత్రం( Jailer movie ) పై బలంగానే పడింది అని బార్క్ సంస్థ వారు అంటున్నారు.

ఈమధ్య కాలం లో జెమినీ టీవీ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ కరువు అయ్యాయి.రీసెంట్ గా టెలికాస్ట్ అయిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రానికి కూడా చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి.

Telugu Diwali, Jailer, Rajinikanth, Tollywood, Trp-Movie

అలాంటి జెమినీ టీవీ లో బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతున్న సమయం లోనే జైలర్ చిత్రం టెలికాస్ట్ అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది.థియేటర్స్ లో ఈ చిత్రం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో, డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.గత రెండు నెలల నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నాన్ స్టాప్ గా ట్రెండింగ్ అవుతూనే ఉంది.వచ్చే ఏడాది వరకు ట్రెండ్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి మొదటి టెలికాస్ట్ లో కేవలం 5 నుండి 6 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉందట.ఇది ఆ సినిమా రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.

ఒకవేళ అంచనాలు తారుమారై ఈ చిత్రానికి 9 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తే మాత్రం అద్భుతమైన రేటింగ్ అనే చెప్పొచ్చు.

Telugu Diwali, Jailer, Rajinikanth, Tollywood, Trp-Movie

మరో పక్క బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యిందట.ఈ ఎపిసోడ్ కి 10 కి పైగానే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.

వీక్ డేస్ లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ కి యావరేజి గా 7 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి.ఇది సాధారణమైన విషయం కాదు.

గత సీజన్ కి ఇందులో సగం కూడా ఉండేది కాదట.వచ్చే వారం ‘జైలర్’ మరియు ‘బిగ్ బాస్’ దీపావళి ఎపిసోడ్ టీఆర్ఫీ రేటింగ్స్ అధీకారికంగా బయటకి రానున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube