దివి వాద్య ( Divi Vadthya ) బిగ్ బాస్ 4 ద్వారా హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించింది దివి.ఇక ఈమె బిగ్ బాస్ లోకి వెళ్ళకముందు అంతగా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయి.
అయితే మహేష్ బాబు హీరోగా చేసిన మహర్షి సినిమాలో ఆయన పక్కన నటించే ఛాన్స్ వచ్చింది.ఇక ఇందులో కాలేజీ స్టూడెంట్ గా చేసిన దివివాద్య కాస్త గుర్తింపు వచ్చింది.
అలా బిగ్ బాస్ 4 ( Biggboss 4 )లో అవకాశం రావడంతో దివి బిగ్ బాస్ కి వెళ్లి అందరికీ సుపరిచితమైన అమ్మాయిగా మారిపోయింది.ఇక దివి వాద్య గాడ్ ఫాదర్,జిన్నా,క్యాబ్ స్టోరీస్ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లికి రెడీ అయిపోయింది అంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.
అలాగే దివి వాద్య తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది.దివి గత కొన్ని రోజులుగా ఎన్నో హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సారీ కట్టుకున్న ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి నీ కోసం రోడ్లు గల్లీ గల్లీ అన్ని తిరుగుతున్నాను.
ఎక్కడున్నావ్ రా బాబు అంటూ తన ప్రియుడిని వెతుకుతున్నట్లుగా అర్థం వచ్చే ఒక పోస్ట్ పెట్టింది.
ఆ తర్వాత మరుసటి రోజే మరొక పోస్ట్ చేసింది.ఇక ఆ పోస్టులో దివి వాద్య కింద కూర్చొని ఉంటే ఆమె వెనకాలే ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు.అయితే ఆయన ఫేస్ కనిపించకుండా కవర్ చేసింది.
ఇక ఈ పోస్ట్ కి “ఇతడే నీ కలగన్నా నా ప్రియుడు నా మదిలోని మన్మధుడు” అంటూ వచ్చే ఒక పాటని ఆ పోస్టుకి పెట్టింది.దీంతో బిగ్ బాస్ దివి తన లవర్ ని త్వరలోనే పరిచయం చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
అంతేకాదు ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లికి రెడీ అయిందని ఈ పోస్ట్ చూసి కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి బిగ్ బాస్ దివి ( Biggboss Divi ) తన ప్రియుడి పూర్తి ఫోటోని ఎప్పుడు రివీల్ చేస్తుందో.