రతికా రోజ్( Ratika Rose ) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె పేరు వినగానే ముందుగా బిగ్ బాస్ షో గుర్తుకు వస్తుంది.
ఈ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది రతికా.ఇటీవలె బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది.
మొదట రతికా ఎలిమినేట్ అయిన సమయంలో అభిమానులు బిగ్ బాస్ షో ప్రేమికులు రచ్చ రచ్చ చేస్తూ షో నిర్వాహకులపై మండిపడ్డారు.ఇది ఇలా ఉంటే రతిక బిగ్ బాస్ షో ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.
అలాగే ఆమె వ్యక్తిగత విషయాల్లోను వార్తల్లో నిలిచింది.ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ప్రేమ వ్యవహారంతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది.
మరిన్ని వివరాల్లోకి వెళితే.

రతికాది వికారాబాద్ జిల్లా జనగామ గ్రామం.ప్రస్తుతం వీరు తాండూరులో నివాసం ఉంటున్నారు.రతికా రోజ్ రాములు, అనితలకు( Ramulu, Anita ) రెండో సంతానం.
కాగా వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రతికా రోజ్ తల్లిదండ్రులు ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రతికా నాన్న రాములు మట్లాడుతూ.మాది చాలా చిన్న ఊరు.కేవలం 2 వేల జనాభా ఉంది.మొదట మా అమ్మాయికి పటాస్ షో ( Patas Show )అవకాశం వచ్చింది.
అందులో ఏదో నాలుగు రోజులుగా ఉంటుందని అనుకున్నాను.కానీ ఇంతవరకు వస్తుందని అనుకోలేదు.

ఒకసారి రతికా ఇంటర్ సెకండియర్‌లో విజయ నిర్మలమ్మ( Vijaya Nirmalamma ) తీసిన ఈ జన్మ నీకే అనే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా కావాలని ఫోన్ వచ్చింది.కానీ సినిమాల గురించి మాకు పెద్దగా తెలియదు.మహేశ్ బాబు వాళ్ల అమ్మనే ఫోన్ చేసి అడిగింది.మా అమ్మాయి నాకు సినిమా ఛాన్స్ వచ్చింది.నేను పోతా అంటూ పట్టు పట్టింది.అయితే ఆ సినిమా రిలీజ్ కాలేదు.
మాకు ముగ్గురు కుమార్తెలు సంతానం.రతిక రెండో అమ్మాయి.
మిగిలిన ఇద్దరికీ పెళ్లి చేశాం.ఇప్పుడు మాకు కొడుకు రూపంలో ఉన్నది రతికనే అని గర్వంగా చెప్పుకొచ్చారు రాములు.
అలాగే రాహుల్ సిప్లిగంజ్ వాళ్ల ఇంటికి కూడా పోయినాము.మా అమ్మాయితో రెండు, మూడు పాటలు చేసిండు.
యూట్యూబ్‌లో పెడితే పైసలు వస్తాయి కదా అని అనుకున్నాం.మా చిన్నపాప పెళ్లికి కూడా రాహుల్ వచ్చిండు.
మా వరకైతే పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు.అయితే మా పాపకు పెళ్లి కావాలే.
మా అమ్మాయితో ఇలా సినిమా పాటలు తీస్తే ఎలా? అని ఒకసారి రాహుల్‌ను బెదిరించాను.మా ఊర్లో వాళ్లయితే వాడితోనే డ్యాన్స్ చేసి వాడితోనే పోతుంది అనేవారు.
కానీ మేము వాటిని పట్టించుకోలేదు.రాహుల్ కూడా అందరిలాగే పెళ్లికి వచ్చిండు.
కానీ ఇలా జరుతుందని మేం కూడా అనుకోలేదు.రతికా అందరినీ ఫ్రెండ్‌లాగే భావిస్తుంది.
బిగ్ బాస్‌లో పల్లవి ప్రశాంత్‌తో ఒక స్నేహితుడిలాగే మాట్లాడింది.బయట కావాలనే కొందరు రూమర్స్ తెచ్చారు అని తెలిపారు రాములు.
ఈ సందర్భంగా రతికా తల్లిదండ్రులు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.







