మోనాల్ ను టార్చర్ చేసిన అరియానా.. నటించావా అంటూ..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలేకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ పదిరోజుల పాటు హౌస్ లో ప్రవర్తన, టాస్కుల్లో పెర్ఫామెన్స్ ను బట్టే బిగ్ బాస్ విన్నర్, రన్నర్ గా ఎవరు ఫైనల్ అవుతారో తేలనుంది.

దీంతో బిగ్ బాస్ సైతం కఠినమైన టాస్కులు ఇస్తున్నాడు.నిన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఓపిక టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ ఏం చేసినా ఓపికగా కూర్చోవాలని ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఇవ్వకూడదని ఓపికగా కూర్చున్న కంటెస్టెంట్ ఎన్ని ఎక్స్ ప్రెషన్స్ ఇస్తారో కౌంట్ చేయాలని సూచించాడు.టాస్క్ లో భాగంగా అరియానాకు ఎంతో ఇష్టమైన బొమ్మను మోనాల్ దూరంగా విసిరేసింది.

అయితే ఆ సమయంలో ఓపికగా ఉన్న అరియానా మోనాల్ ఓపిక టాస్క్ లో భాగంగా రోబోలా కూర్చున్న సమయంలో తన మనస్సులోని ఆవేదనను వెళ్లగక్కింది.మోనాల్ గత వారం అవినాష్ ను కాలితో తన్నిందని.

Advertisement

కాలితో తన్ని మరీ ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందని అరియానా అన్నారు.తనకు బొమ్మ అంటే ఎంతో ఇష్టమని తెలిసినా పడేసేందుకు మోనాల్ ప్రయత్నించిందని కావాలని మోనాల్ తనను బాధ పెట్టాలనుకుందని అనుకుందని అరియానా మోనాల్ పై కామెంట్లు చేశారు.

మోనాల్ కు తనపై చాలా పగ ఉందని అంత పగ ఉంటే ఇన్నిరోజులు నటించాల్సిన అవసరం ఏముందని అరియానా ప్రశ్నించారు.అరియానా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ఉంటే మోనాల్ టాస్క్ పూర్తైన వెంటనే గట్టిగా ఏడ్చేసింది.అరియానా తన మాటలతో మోనాల్ ను టార్చర్ చేయగా అరియానా ప్రశ్నలకు మోనాల్ నుంచి సమాధానం రాలేదు.

ఆ తరువాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కు పిలిచి మోనాల్ ను ఓదార్చే ప్రయత్నం చేశాడు.అయితే మోనాల్ ను ఏడిపించడంతో సోహైల్ అరియానాపై సీరియస్ అయ్యాడు.

సొహైల్ అరియానా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో అరియానా సొహైల్ మధ్య గొడవ ఎలా సద్దుమణుగుతుందో చూడాల్సి ఉంది.మరోవైపు బిగ్ బాస్ వీక్ డేస్ టైమింగ్స్ మారడంతో ఈ షోను చూసే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుందని తెలుస్తోంది.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు