బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టి మొదటి వారమే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు కంటెస్టెంట్ బెజవాడ బేబక్క( Bejawada Bebakka ).సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బిగ్ బాస్ 8( Bigg Boss 8 ) కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు.
అయితే మొదటి వారమే నామినేషన్స్ లో నిలిచిన ఈమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతూ బయటకు వచ్చారు.ఇలా ఈమె హౌస్ లో ఉన్నది వారం రోజులు అయినా భారీ స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకున్నారు.
ఇక ఈమె హౌస్ నుంచి బయటకు రావడంతో ఎంతోమంది అభిమానులు ఈమెతో సెల్ఫీలు తీసుకోవడం కోసం పోటీపడుతున్నారు.

ఇక ఎంతోమంది ఈమె ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.ఇలా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈమె కూడా బిజీగా గడుపుతున్నారు.అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబక్క పలు సంచలనమైన విషయాలను వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె చేతి వాచ్( Wrist Watch ) యాంకర్ ను ఆకట్టుకుంది.దీంతో తన చేతి వాచ్ గురించి ప్రశ్నించారు అయితే ఈమె ఆ వాచ్ ఖరీదు ఏకంగా 78 కోట్లు అని చెప్పి షాక్ ఇచ్చింది.

యాంకర్ సైతం 78 కోట్ల అని ఆశ్చర్యపోగా ఆ వాచ్ గురించి పలు విషయాలను బేబక్క వెల్లడించారు.ఈ వాచ్ ఈ భూమి మీద ఎక్కడ దొరకదని తెలిపారు ఈ వాచ్ తయారీ కోసం వాడే మెటల్ మార్స్( Mars ) నుంచి తెప్పించామని అందుకే 78 కోట్లు ఖర్చు అయ్యిందని తెలిపారు.ఇక వాచ్ లో డైమండ్స్ కూడా ఉన్నాయని వెల్లడించారు.ఇలా మార్స్ నుంచి ఆ మెటల్ తీసుకురావడం కోసం రాకెట్ తో సహా ఆయన ఖర్చులన్నీ కలిపి 78 కోట్ల విలువ చేస్తుందని తెలిపారు.
అంతేకాకుండా అదే మెటల్ తో తన హ్యాండ్ బ్యాగ్ కూడా తయారు చేయించుకున్నానని ఆ బ్యాగ్ ఖరీదు 180 కోట్లు అని చెప్పడంతో యాంకర్ ఒక్కసారిగా షాక్ అవుతూ.ఇంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ వాచ్ పెట్టుకొని మీరు ఎందుకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లారు అంటూ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.