Pallavi Prashanth :ఆ వ్యక్తి చేసిన మోసం వల్ల సూసైడ్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్..!!

బిగ్ బాస్ 7 ( Biggboss7 ) హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే వీడేం చేస్తాడు వీడు పల్లెటూరి బైతూ అన్నట్లుగా చులకన చేసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ సీరియల్ బ్యాచ్ ఎంత ఆయన్ని తొక్కేయాలని చూసినా కూడా హీరో శివాజీ పల్లవి ప్రశాంత్ వెన్నంటే ఉంటూ అతని మీద ఒక్క మాట కూడా పడకుండా ప్రతి విషయంలో ప్రశాంత్ కి ధైర్యం చెబుతూ కప్పు కొట్టేలా ధైర్యం ఇచ్చారు.

అయితే అలాంటి పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) హౌస్ లోకి వెళ్ళాక తనదైన ఆటతో అలాగే అందరితో మంచి ప్రవర్తనతో మెదిలి కోట్లాదిమంది అభిమానులను తన ప్రవర్తన ఆటతో వారి మదులను గెలుచుకొని బిగ్ బాస్ 7 విన్నర్ గా అయ్యారు.

అయితే సెలబ్రిటీలు అయితే ఇది అంత చెప్పుకోదగిన విషయం కాదు.కానీ మొదటిసారి ఒక రైతు బిడ్డ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Wanted To Commit Suicide Due To The Mans C

ఇదంతా పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడంతో చాలామంది ఈయన గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.అలాగే ఆయనకి సంబంధించిన ఎన్నో విషయాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే 500 రూపాయలతో హైదరాబాద్ ( Hyederabad ) కి వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వరకు కూడా తన ప్రయత్నాన్ని ఆపలేదు.

ఇక పల్లవి ప్రశాంత్ ఒకానొక సమయంలో ఆ వ్యక్తి చేతిలో మోసపోయి చివరికి సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట.ఇక అసలు విషయం ఏమిటంటే.పల్లవి ప్రశాంత్ యూట్యూబ్( Youtube ) ద్వారానే అందరికీ పరిచయం.

Advertisement
Bigg Boss 7 Winner Pallavi Prashanth Wanted To Commit Suicide Due To The Mans C

ఈయన ఎన్నో షార్ట్స్,అలాగే రీల్స్ తీస్తూ చాలా ఫేమస్ అయ్యారు.అలాంటి పల్లవి ప్రశాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకున్నారట.

అలా ఛానల్ రేటింగ్ పెరిగే కొద్దీ డబ్బులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయట.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Wanted To Commit Suicide Due To The Mans C

ఇక ఎప్పుడైతే ఛానల్ కి మంచి రేటింగ్ వచ్చి డబ్బులు వచ్చాయో ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని ఆ ఛానల్ నుండి తన ఫ్రెండ్స్ తీసేసారట.ఇక క్లోజ్ ఫ్రెండ్స్ అలా చేయడం తీసుకోలేకపోయినా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) సూసైడ్ చేసుకోవాలి అనుకున్నారట.కానీ ఆ సమయంలో తన పేరెంట్స్ ప్రశాంత్ ని ఓదార్చి ధైర్యం చెప్పారట.

తల్లిదండ్రులు చెప్పిన ధైర్యంతో మళ్ళీ పల్లవి ప్రశాంత్ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అని తన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చారు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు