సీక్రెట్ రూమ్ నుండి హౌస్ లోకి గౌతమ్ రీఎంట్రీ.. ఒక్కొక్కరికి చెమటలు పట్టించాడుగా..

బిగ్ బాస్( Bigg Boss ) అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకున్న విషయం తెలిసిందే.

 Bigg Boss 7 Telugu New Promo Gautham Krishna Re Entry From Secret Room, Bigg B-TeluguStop.com

ఇక 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.

ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే( Nagarjuna ) చేస్తుండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా ఐదు వారాల్లో ఐదు మంది ఎలిమినేషన్ అయ్యారు.

తాజాగా ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. బిగ్ బాస్ 2.0 గ్రాండ్ గా అక్టోబర్ 8న మినీ లాంచింగ్ జరిగింది.ఈసారి హౌస్ లోకి ఎంట్రీ 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

అదే రోజు ఆదివారం శుభ శ్రీ ను ఎలిమినేట్ చేసి గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్ లోకి పంపించారు. గౌతమ్( Gautham krishna ) సీక్రెట్ రూమ్ నుండి అన్నిటిని గమనిస్తూనే ఉన్నాడు.ఎవరు తన గురించి ఎలా మాట్లాడారో అన్ని వింటూనే ఉన్నాడు.ఇక నాగ్ ఇతడిని సీక్రెట్ రూమ్ లోకి పంపించి టైం చూసి హౌస్ లోకి పంపిస్తాం అని చెప్పగా చెప్పినట్టే ఈ రోజు ఎపిసోడ్ లో గౌతమ్ ఎంట్రీ అదిరిపోయే లెవల్లో జరిగింది అని తెలుస్తుంది.

గౌతమ్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తూనే ఒక ఫైర్ తనలో కనిపించింది.అశ్వద్ధామ ఈజ్ బ్యాక్.మీరందరు తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు.అయినా ఈ అశ్వద్ధామ చావడు అంటూ అరుస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో కంటెస్టెంట్స్ అంత నివ్వెరపోయారు.ఈయన ఎంట్రీ తర్వాత గౌతమ్ కు హౌస్ లో స్పెషల్ పవర్ ఇచ్చి హౌస్ లో ఉన్న వారిలో ఒకరిని నామినేట్ చేయమని చెప్పగా ఎవరిని నామినేట్ చేస్తాడా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అయ్యింది.

https://youtu.be/2bOCbpNYIdo
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube