తాజాగా బిగ్ బాస్ 6 షో ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ విన్నర్ గా రేవంత్ నిలిచాడు.
దీంతో రేవంత్ కి అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇది ఇలా ఉంటే రేవంత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో బిగ్బాస్ ట్రోఫిని గెలిచేది నేనే అంటూ ఎన్నోసార్లు గర్వంగా చెప్పిన విషయం తెలిసిందే.
కానీ మొదట్లో చాలామందికి అది విడ్డూరంగా అనిపించడం మాత్రమే కాకుండా కోపానికి ఆవేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఇతను రెండు మూడు వారాల్లోనే వెళ్లిపోతారు అని చాలామంది అనుకున్నారు.ఇంత కోపం ఉన్న ఇతను గెలవడం ఏంటి అని చాలామంది నవ్వుకున్నారు.
ఇక హోస్ట్ నాగార్జున ప్రతిసారి రేవంత్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తూ కోపాన్ని తగ్గించుకోమని హెచ్చరిస్తూ వచ్చాడు.
ఆ తర్వాత వారం వారం గడిచే కొద్దీ రేవంత్ తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నాడు.
టాస్కుల్లో భాగంగా ఎవరినీ కేర్ చేయకుండా ఎదుటి మనుషుల మనసు నొచ్చుకున్న పర్వాలేదు అనుకుంటూ టాస్క్ ల విషయంలో పోటా పోటీ పడి ఆడిన రేవంత్ టాస్క్ అయిపోయిన తర్వాత మళ్లీ ఎవరిమీద అయితే కోప్పడి ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్లి స్వారీ చెప్పి వాళ్ళకి నచ్చజెప్పడం అన్నది రేవంత్ లో ఉన్న గొప్ప లక్షణంగా చెప్పుకోవచ్చు.అయితే అప్పటివరకు వారిపై సీరియస్ అయి ఇంతలోనే వచ్చి సారీ చెప్పడంతో కంటెస్టెంట్లు కూడా రేవంత్ ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయేవారు.
హౌస్ లో రెండుసార్లు కెప్టెన్ అయిన రేవంత్ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు ఎంతసేపు సరుకులు అయిపోకుండా ఎలా ఉండాలి అని ఆలోచించే వాడే తప్ప మిగిలిన వాళ్ళ ఆకలి తీరుతుందా లేదా అని కూడా అర్థం చేసుకునేవాడు కాదు.అంతేకాకుండా కంటెస్టెంట్లు ఆకలి అవుతుంది అని అడిగినా కూడా ఏమాత్రం జాలి పడకుండా రేషన్ మేనేజర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవాడు.

మరి హౌస్ లో చాలా వరకు మైనస్లే ఉన్న రేవంత్ హౌస్ లో ఎలా విన్నర్ అయ్యాడు అన్నది ఆసక్తికరంగా మారింది.రేవంత్ విన్నర్ అవడం వెనుక ఉన్న రహస్యాల విషయానికొస్తే.రేవంత్ కి హౌస్ లో ఎవరు అతనికి గట్టి పోటీ ఇవ్వలేకపోయారు.మొదట్లో సైలెంట్ గా ఉన్న శ్రీహాన్ ఆ తర్వాత గేమ్ ఆడటం మొదలుపెట్టి రేవంత్ కి గడ్డి పోటీ ఇవ్వడానికి ట్రై చేశాడు.
ఇక మిగిలిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క తప్పులు చేస్తూ ఉండడం వల్ల అది రేవంత్ కి మరింత ప్లస్ పాయింట్ అవుతూ వచ్చింది.ఆదిరెడ్డి ఎంతసేపు రివ్యూ చెప్పడం కీర్తి ప్రతి చిన్నదానికి ఏడుస్తూ బాధపడటం, ఇక మాట విషయంలో ప్రవర్తన విషయంలో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న రోహిత్ ఆటలో మాత్రం వెనుక పడటం ఇవన్నీ కూడా రేవంత్ విన్నర్ అవ్వడానికి వెనుక రహస్యాలు అని చెప్పవచ్చు.







