Syed Sohel : సురేష్ కొండేటికి చుక్కలు చూపించిన బిగ్ బాస్ సోహెల్.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్( Syed Sohel ) గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు.

బిగ్ బాస్ తర్వాత వెండితెరపై సినిమాలు చేస్తూ హీరోగా ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.

కానీ ఏ సినిమాలు కూడా ఆయనకు అంత సక్సెస్ ఇవ్వలేవు.కానీ ఇప్పుడు ఆయన ఆశలన్నీ తను నటించిన మిస్టర్ ప్రెగ్నెంట్( Mr.Pregnant ) సినిమాపై ఉన్నాయని చెప్పాలి.డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా ఈనెల 18న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా సినీ బృందం ప్రమోషన్స్ లో బాగా బిజీగా ఉంటున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఉల్టా పల్టా అనే పాటను కూడా విడుదల చేశారు.అయితే ఈ కార్యక్రమంలో కాంట్రవర్సీ జర్నలిస్టు సురేష్ కొండేటిని సోహెల్ బాగా హింసించాడు.

Advertisement

ఈ మధ్యకాలంలో జర్నలిస్టు సురేష్ బాగా వైరల్ అవుతున్నాడు.సినిమా ప్రెస్ మీట్ లో ఆయన నటీనటులపై, దర్శక నిర్మాతలపై వేసే ప్రశ్నలు కాస్త కఠినంగా ఉంటాయి కాబట్టి తన ప్రశ్నలతో బాగా వైరల్ అవుతున్నాడు.

సోషల్ మీడియాలో కూడా ఈయనకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఆయన మిస్టర్ ప్రెగ్నెంట్ సాంగ్ రిలీజ్ వేడుకలో పాల్గొన్నాడు.

అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా స్టోరీపై అందరికీ కాస్త అవగాహన ఉందని చెప్పాలి.అందులో హీరో ప్రెగ్నెంట్ అవుతాడు.అయితే ఆ ప్రెగ్నెంట్ నొప్పులు ఎలా ఉంటాయో చూపించేందుకు ఈ కార్యక్రమంలో ఒక మిషన్ కూడా తీసుకువచ్చారు సినీ బృందం.

అయితే ఆడవాళ్లు భరించే ఆ నొప్పిని మగవారికి అర్థం అయ్యేందుకు ఆ మిషన్ వైర్లను నడుముకు చుట్టడం వల్ల ఆ నొప్పి ఏంటో తెలిసిపోతుంది.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

అయితే సురేష్ కొండేటి పై( Suresh Kondeti ) ఈ మెషిన్ ను ప్రయోగించారు.దాంతో సురేష్ కొండేటి ఆ నొప్పులు భరించలేక బాగా అరిచాడు.ఇక అక్కడున్న కొందరు మీడియా ప్రతినిధులు ఈసారి సురేష్ కొండేటిని ప్రశ్నించారు.

Advertisement

మీకు ఎన్నో నెల అని సరదాగా అడగటంతో ఆరో నెల అని ఆయన జవాబు ఇచ్చాడు.నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరని అడగటంతో సోహెల్ అంటూ సరదాగా స్పందించాడు.

ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అవ్వగా.మొత్తానికి సినీ సెలబ్రెటీలతో చుక్కలు చూపించే సురేష్ కు తిరిగి సోహెల్ బాగా చుక్కలు చూపించాడంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు