మెగా బ్రదర్ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా??

రాజకీయాల్లో( politics ) చివరి నిమిషం వరకు ఓటమును ఒప్పుకోకపోవడం సాధారణంగా కనిపించే విషయం కింద పడ్డా మాదే విజయం అంటూ రాజకీయ నాయకులు వాదిస్తుంటారు .ఓడిపోయినా నైతిక విజయం మాదే అని అంటారు.

 Big Stratagy Behind Nagababu Words , Nagababu, Big Stratagy, Pawan Kalyan , Jana-TeluguStop.com

లేదా అవతల వాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేసి గెలిచారని ఆరోపణలు చేస్తుంటారు .అయితే ముక్కు సూటుగా వ్యవహరించే నాయకుడిగా పేరున్న పవన్ కళ్యాణ్ జనసేన( Pawan Kalyan ,Janasena ) – తెలుగుదేశం పొత్తుపై చేసిన వ్యాఖ్యలు జనసేన వర్గాల్లో ఒకింత నిరుత్సాహాన్ని కలిగించాయని చెప్పాలి .నాకు సీఎం పదవి ఎవరు ఇస్తారు ? కనీసం 30 40 సీట్లు ఉండి ఉంటే సీఎం పదవిని ఆశించేవాడినంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన సీఎం రేసులో లేరన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించే విధంగా ఉండటంతో జనసేన వర్గాలు డీలా పడ్డాయి.

Telugu Big Stratagy, Bigstratagy, Janasena, Naga Babu, Nagababu, Pawan Kalyan-Te

అయితే వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే జన సైనికులలో ఉత్సాహం తీసుకురావాలని ఆలోచనలో ఉన్న పార్టీ అధిష్టానం మళ్ళీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ స్టేట్మెంట్లు ఇస్తుంది.ఆ దిశగా మెగా బ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్ సీఎం గా ఉంటే రాష్ట్రం గాడిన పడుతుందని, మెజారిటీ వర్గం ఆయనను సీఎంగా చూడాలనుకుంటుంది అంటూ చేసిన వ్యాఖ్యలు జనసేనలో చర్చకు దారి తీసాయి .ఈనెల 14న తూర్పుగోదావరి జిల్లా నుంచి వారాహి యాత్రను ప్రారంభించబోతున్న పవన్ కళ్యాణ్ యాత్రకు ఊపు తీసుకురావడానికే నాగబాబు( Naga Babu ) ఇలా ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది.

Telugu Big Stratagy, Bigstratagy, Janasena, Naga Babu, Nagababu, Pawan Kalyan-Te

తమ బలం ఉన్నచోట పోటీ చేసి మెజారిటీ సీట్లను గెలుచుకుంటే అప్పుడు సీఎం సీటు గురించి ఆలోచించవచ్చు అన్న విషయాన్ని ఆ కోణం లో కాకుండా సీఎం సీటు తమకు చాలా దూరంగా ఉందన్న కోణంలో వ్యాఖ్యలు చేయడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారిందని వార్తలు వచ్చాయి.ఆ తర్వాత రోజు చేసిన స్పీచ్ లో కొంత కవర్ చేసుకోగలిగినప్పటికీ పవన్ సీఎం రేసులో లేరు అన్న పరోక్ష సంకేతాలు మాత్రం జనం లోకి వెళ్లాయని చెప్తున్నారు.ఏది ఏమైనా వరాహి యాత్ర తర్వాత రాష్ట్రంలో జనసేన గ్రాఫ్ పెరిగితే మరొకసారి పవన్ సీఎం కాండిడేట్ అని నినాదాలు బలం పెరుగుతుందని చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube