ఎన్నికలవేళ పవన్ కి బిగ్ షాక్.. జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నెల రోజుల్లో పోలింగ్.2024 ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) భావిస్తున్నారు.

2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓడిపోయారు.

ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయగా విజయం సాధించటం జరిగింది.దీంతో ఈసారి కూడా విజయం సాధించాలని కూటమి నేతలు భావిస్తున్నారు.

Big Shock To Pawan During The Election Janasena Party Youtube Channel Hacked Ap

పరిస్థితి ఇలా ఉంటే సరిగ్గా ఎన్నికలవేళ జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్( JanaSena YouTube channel ) హ్యాక్ కావటం జరిగింది.జనసేన పార్టీ పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చి.బిట్ కాయిన్ కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

గతంలో జనసేన పార్టీకి సంబంధించిన వీడియోలు చాలావరకు డిలీట్ అయిపోయాయి.ఇటీవల చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వీడియోలు కూడా కనిపించడం లేదు.

Advertisement
Big Shock To Pawan During The Election Janasena Party YouTube Channel Hacked AP

కొన్ని వీడియోలు మాత్రమే ఉన్నాయి.అయితే జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావటం పట్ల పార్టీ ప్రతినిధులు ఎవరు స్పందించలేదు.

జనసేన యూట్యూబ్ ఛానల్ కి 14 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.పార్టీ కార్యక్రమాలు లైవ్ స్ట్రీమింగ్ లు.పవన్ కళ్యాణ్ ప్రసంగాలు అందులో స్ట్రీమింగ్ చేస్తుంటారు.సరిగ్గా ఎన్నికల సమయంలో జనసేన యూట్యూబ్ ఛానల్ హ్యాక్ కావటం సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు