జనాలను పిచ్చోళ్లను చేయొద్దు.. అలియా భట్ పై ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌( Alia Bhatt ) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జిగ్రా.

వేదాంగ్‌ రైనా మరో లీడ్‌ రోల్‌ పోషించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న విడుదలైంది.

తాజాగా విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సిద్ధం చేసుకుంది.కానీ ఈ ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.

అయితే మూవీ విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా కష్టపడిన విషయం తెలిసిందే.అయితే ఇదే రోజు విక్కీ కౌశల్, తృప్తిల సినిమా విక్కీ విద్య కా వో వాలా వీడియో రిలీజైంది.

దీంతో రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.అయితే ఈ పోటీని తట్టుకుని జిగ్రా అదరగొడుతోందంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి.సినిమా అద్భుతంగా ఆడుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.

Advertisement

దీంతో చాలామంది ఇది నిజం అని నమ్ముతున్నారు.అయితే తాజాగా ఈ పోస్టులపై.

ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ భార్య, నటి దివ్య ఖోస్లా కుమార్‌( Divya Khosla Kumar ) స్పందించింది.జిగ్రా చూద్దామని పీవీఆర్‌ మాల్‌ కు వెళ్లాను.

థియేటర్‌ అంతా ఖాళీగా ఉంది.ప్రతి ఒక్క చోట కూడా ఇదే పరిస్థితి.

అయినా ఆలియా భట్‌ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

ఈ ఎగ్ మాస్క్ తో స్పాట్ లెస్ అండ్‌ వైట్ స్కిన్ పొందొచ్చు.. తెలుసా?
వరుణ్ తేజ్, సూర్యలకు భారీ షాకులు.. కథల ఎంపికలో తప్పులు చేస్తే ఫ్లాప్ తప్పదా?

అన్ని టికెట్లు తనే కొనేసినందుకు లేదా ఫేక్‌ కలెక్షన్స్‌ ప్రకటించినందుకు! పెయిడ్‌ మీడియా ఎందుకు సైలెంట్‌ గా ఉందో అర్థమవట్లేదు అని తెలిపారు.ఏదేమైనా మనం ఆడియన్స్‌ ను ఫూల్‌ చేయవద్దు అంటూనే దసరా శుభాకాంక్షలు తెలియజేసింది.ఈ పోస్టుకు తను థియేటర్‌లో జిగ్రా సినిమా ( Jigra )చూస్తున్న ఫోటోను జత చేసింది.

Advertisement

అందులో థియేటర్‌ హాల్‌ అంతా ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది.మరి ఈ పోస్ట్ పై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

తాజా వార్తలు