విడాకుల వార్తలపై స్పందించిన భూమిక.. ఏం చెప్పిందంటే..?

రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో భూమిక ఒకరు.

భూమిక కెరీర్లో ఖుషి, సింహాద్రి, ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.

యంగ్ హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోలతో సైతం నటించిన భూమిక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తరువాత యోగా టీచర్ భరత్ ఠాకూర్ ను వివాహం చేసుకున్నారు.పెళ్లి తరువాత వీళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.

Bhumika Chawala Check To Divorce Rumors With Anniversary Post, Bhumika Chawla, B

అయితే గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో భూమిక, భరత్ ఠాకూర్ విడిపోయారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ప్రస్తుతం అక్క, వదిన తరహా పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న భూమిక గురించి ఇలాంటి వార్తలు రావడం ఆమె అభిమానుల్లో ఆందోళనను పెంచింది.

వైరల్ అవుతున్న వార్తలు నటి భూమిక దృష్టికి కూడా వెళ్లాయి.అయితే వివాదంపై ప్రత్యక్షంగా స్పందించకుండా ఒక ఫోటో ద్వారా ఆమె వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు.

Advertisement

తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భూమిక భర్తతో కలిసి దిగిన ఫోటోను అప్ లోడ్ చేశారు.మ్యారేజ్ డే కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన భూమిక ఆ పోస్ట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

వేల మైళ్ల పయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుందని.ఆ అడుగు కూడా ప్రేమేనని.

ఆ ప్రేమ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటమేనని అన్నారు.దేవుడు మన ప్రయాణాన్ని ఆశీర్వదించాలని ఆమె పేర్కొన్నారు.

మీ కృషి, అంకితభావాన్ని చూసి ఎంతో గర్వపడతానని భూమిక భర్త గురించి పేర్కొన్నారు.భూమిక ఈ ఒక్క పోస్టు ద్వారా అభిమానుల అనుమానాలన్నీ పటాపంచలు చేసినట్లేనని చెప్పవచ్చు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

భూమిక, భరత్ ఠాకూర్ లకు ఒక బాబు ఉన్నాడు.భూమిక చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు