భూమా ఫ్యామిలీ.( Bhuma Family ) ఆళ్లగడ్డ నుంచి అనేక సంవత్సరాలుగా రాజకీయం లో ఉన్న కుటుంబం.
పేరుకు మాత్రమే ఫ్యాక్షన్ లీడర్లు కానీ ఎంతో హుందా అయినా రాజకీయ నాయకులు.ఇప్పుడు భూమా కుటుంబం నుంచి వారసులుగా, అఖిల ప్రియా, మౌనిక రెడ్డి, విఖ్యాత్ రెడ్డి ఉన్నారు.
అయితే వీరి కన్నా ముందు తరాలకు వీరికి ఉన్న తేడా కూడా అదే.హుందాతనం లేదు.నోటికి పని చెప్తూ ఉంటారు.పెద్ద వాళ్లంటే గౌరవం లేదు.కానీ ఈ ముగ్గురిని కన్నా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తెలుగు దేశం పార్టీ లో ఉంటూ ఎంతో హుందాకరమైన రాజకీయాలు చేసారు.ఎప్పుడు ప్రతి పక్షం పైన కూడా నోరు జారింది లేదు.
భూమా నాగిరెడ్డి( Bhuma Nagireddy ) కన్నా ముందు అయన తండ్రి భూమా బాలిరెడ్డి రాజీకీయాల్లో లేకపోయినా సేవ కార్యక్రమాలతో పాటు సినిమా రంగం లో కూడా ఉన్నారు.ఈ విషయం చాల మందికి తెలియదు.భూమా బాలిరెడ్డి కొన్ని సినిమాలను సైతం నిర్మించాడు.1976 లో భూమా బాలిరెడ్డి నిర్మాతగా ఉత్తమురాలు( Uttamuralu Movie ) అనే సినిమాను నిర్మించారు.వీరు గుంతకల్ లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ని కూడా నడిపించేవాడు.సినిమా నిర్మాణం కోసం ఎస్ వి ఎస్ ఆర్ బ్యానర్ ని స్థాపించగా డిస్ట్రిబ్యూషన్ కోసం వీరబ్రహ్మేంద్ర ఫిలిమ్స్ ని స్థాపించారు.
వారి కుటుంబం నుంచి వచ్చిన భూమా శేఖర్ రెడ్డి, భూమా భాస్కర్ రెడ్డి లు సంయుక్తంగా 1990 లో ఖైదీ దాదా అనే సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో సుమన్ హీరో గా నటిస్తే రాదా హీరోయిన్ గా నటించింది.
ఇలా ఒక ఫ్యాక్షన్ మరియు రాజకీయ ఫ్యామిలీ అయినా భూమా కుటుంబం నుంచి సినిమాలు కూడా రావడం బట్టి చూస్తే వారి అభిరుచి ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.కానీ పెంపకం బాగోలేదో ఇంకా ఏ కారణమో తెలియదు కానీ అఖిల్ ప్రియా, మౌనిక రెడ్డి లు వ్యక్తి గత జీవితం లో ఫెయిల్ అయ్యారు.ఇద్దరి మొదటి వివాహాలు బెడిసి కొట్టాయి.ఇక ముందు ముందు అయినా వీరి దూకుడు స్వభావం తగ్గి హుందా అయినా రాజకీయాలు చేసి, తమ తండ్రి, తాతల పేర్లు నిలబెట్టాలని ఆళ్లగడ్డ వారే కాదు రెండు తెలుగు రాష్ట్రాల భూమా అభిమానులు కోరుకుంటున్నారు.