భగవంత్ కేసరి వర్సెస్ భోళా శంకర్.. ఆ పాయింట్ ను లాగుతున్న ఫ్యాన్స్!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో భోళా శంకర్( Bhola Shankar ) ఒకటి.

ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఈ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఇక అంతకు ముందే బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి నుండి టీజర్ రిలీజ్ అయ్యింది.

మరి నిన్న చిరు టీజర్ కూడా రాగానే ఇరు ఫ్యాన్స్ ఈ రెండు టీజర్స్ మధ్య పోలిక చూస్తున్నారు.తమ హీరో టీజర్ బాగుందంటే మా హీరో టీజర్ బాగుంది అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య రచ్చ స్టార్ట్ అయ్యింది.

కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి - బాలకృష్ణ మధ్య పోటీ జరుగుతూనే ఉంది.ఇప్పుడు టీజర్స్ మధ్య కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ ఓ రేంజ్ కొనసాగుతుంది.

Advertisement
Bholaa Shankar Vs Bhagavanth Kesari , Bhola Shankar Teaser, Bhola Shankar, Megas

మరి ఫ్యాన్స్ అంటే ఎప్పుడు ఇలా తమ హీరోనే పొగుడుతూ కామెంట్ చేయడం కామన్ విషయమే.

Bholaa Shankar Vs Bhagavanth Kesari , Bhola Shankar Teaser, Bhola Shankar, Megas

అదే సమయంలో ఈ రెండు సినిమాల మధ్య ఒక పాయింట్ ఉందంటూ టాక్ వినిపిస్తుంది.ఆ విషయాన్నీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోవడం గమనార్హం.భగవంత్ కేసరి( Bhagwanth Kesari ) సినిమాలో బాలయ్య తన ఏజ్ కు తగ్గ రోల్ చేస్తుంటే భోళా శంకర్ సినిమాలో మాత్రం చిరు తన ఏజ్ కు తగ్గ పాత్ర చేయలేదు అనే టాక్ వినిపిస్తుంది.

టీజర్స్ ను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది.

Bholaa Shankar Vs Bhagavanth Kesari , Bhola Shankar Teaser, Bhola Shankar, Megas

ఈ రెండు టీజర్స్ ను చూసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తున్నాయి.బాలయ్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం ఆయనకు సెట్ కాలేదని అంటున్నారు.అలాగే చిరు కాస్ట్యూమ్స్ నచ్చలేదని వాల్తేరు వీరయ్యలో( Waltheru Veeraya ) చూసినట్టే అనిపిస్తుంది కానీ కొత్తగా ఏమీ లేదని అంటున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

అంతేకాదు చిరు తన ఏజ్ కు తగ్గ పాత్రలు ఎంచుకుంటే బాగుంటుంది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ రెండు సినిమాల్లో ముందుగా ఆగస్టులో భోళా శంకర్ తో మెగాస్టార్ వాట్సఉంది ఆ తర్వాత రెండు నెలల గ్యాప్ తో భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య రాబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు