బాల్యం నుంచి చదువులో రాణించడం అంటే సులువైన విషయం కాదు.పోటీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే ఎలాంటి తప్పటడుగులు వేయకుండా కెరీర్ పరంగా ముందడుగులు వేయాలి.
అన్నె భార్గవి రాణి( Bhargavi Rani ) పదో తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచి ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశారు.సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్( M.Tech in Central University ) , జపాన్ లో పీహెచ్డీ పూర్తి చేసిన ఆమె సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.విజయవాడ సమీపంలోని నిడమానూరుకు చెందిన భార్గవి గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆమె భర్త సౌత్ కొరియాలోని యూనివర్సిటీలో( university in South Korea ) నానో టెక్నాలజీలో పని చేస్తున్నారు.బిడ్డ పుట్టిన కొన్ని రోజులకే ప్రొఫెసర్ ఉద్యోగం సాధించిన భార్గవి తన సక్సెస్ స్టోరీతో ప్రశంసలు అందుకుంటున్నారు.
పదో తరగతిలో 548 మార్కులు సాధించిన భార్గవి మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు.

హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీలో 2014 నుంచి 2016 మధ్యలో భార్గవి ఎంటెక్ పూర్తి చేశారు.ఎంటెక్ లో గోల్డ్ మెడల్ సాధించిన భార్గవి సౌత్ కొరియాలోని కైస్ట్ యూనివర్సిటీలో ( Keast University )పోస్ట్ డాక్టరల్ ప్రొఫెసర్ గా పని చేశారు.బిడ్డ పుట్టిన వారం రోజులకే ఎన్.ఐ.టీ ఇంటర్వ్యూకు పిలుపు రాగా బాలింత కావడంతో రిక్వెస్ట్ చేసి ఆన్ లైన్ ద్వారా ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

భర్త, తల్లీదండ్రుల సహాయసహకారాల వల్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడం సాధ్యమైందని భార్గవి చెబుతున్నారు.భార్గవి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.లక్ష్యం బలంగా ఉంటే సక్సెస్ సొంతమవుతుందని ఆమె ప్రూవ్ చేశారు.ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.భార్గవి టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.భార్గవి టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.







