యాదాద్రి భువనగిరి జిల్లా: తెలుగు సినీ,రాజకీయ రంగాల్లో ప్రభంజనం సృష్టించిన మహోన్నత వ్యక్తి దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామరావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని వార్డు మెంబర్ దేప శ్యాంసుందర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.ఆదివారం చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ గ్రామంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ అంటే ఓ వ్యక్తి కాదని మహాశక్తి అని, తెలుగు జాతి ఉన్నంత వరకు వారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు బుర్ర ముత్యాలు,పబ్బు శ్రీనివాస్,దౌడి వెంకటేష్, చామట్ల భిక్షపతి,జింక ముత్యం,సాధిక్,సిలువేరు భిక్షపతి,మల్కాజిగిరి మల్లేష్,ఎండబెట్ల మహేష్, చందుపట్ల సాయి నేత, బుర్ర విజయ్,గుండ్ల లింగస్వామి,అప్పీసు లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.