పాపం చరణ్‌.. ఇది మహేష్‌ స్థాయి, సత్తా

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు మరోసారి తన సూపర్‌ స్టార్‌ పవర్‌ను చూపించాడు.‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ చిత్రాలతో డిజాస్టర్‌లను చవిచూసిన మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేశాడు.

 Bharat Ane Nenu 200 Crores Club-TeluguStop.com

టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా భరత్‌ నిలవడంతో మహేష్‌ క్రేజ్‌ ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.‘శ్రీమంతుడు’ చిత్రంతో రికార్డులు బ్రేక్‌ చేసిన మహేష్‌బాబు మరోసారి భరత్‌ అనే నేను చిత్రంతో రికార్డుల దుమ్ము దులపడం జరిగింది.

అన్ని వర్గాలను ఆకట్టుకున్న ‘భరత్‌ అనే నేను’ 200 కోట్లకు చేరువలో ఉంది.అతి త్వరలోనే ఆ మార్క్‌ను క్రాస్‌ చేయబోతున్నట్లుగా ట్రేడ్‌ పండితులు అంటున్నారు.

మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన రంగస్థలం చిత్రం 200 కోట్ల క్లబ్‌లో చేరింది.తెలుగులో 200 కోట్ల క్లబ్‌లో చేరిన మూడవ చిత్రంగా రంగస్థలం పేరు సంపాదించింది.అయితే ఈ మురిపేం మూడు రోజులు కూడా మిగల్లేదు.

రంగస్థలం చిత్రం నెల రోజులు ఆడిన తర్వాత 200 కోట్లను వసూళ్లు చేసింది.కాని భరత్‌ అనే నేను కేవలం 15 రోజుల్లోనే 200 కోట్లకు చేరువైంది.

రంగస్థలం చిత్రం కంటే భరత్‌ అనే నేను చిత్రానికి గొప్ప టాక్‌ ఏమీ రాలేదు.పైగా రంగస్థలం చిత్రంపైనే ఎక్కువ మంది ప్రశంసలు కురిపించారు.

అయినా కూడా భరత్‌ అనే నేను కలెక్షన్స్‌ సంచలనాత్మకంగా వస్తున్నాయి.కారణం మహేష్‌బాబు క్రేజ్‌ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్‌బాబు స్టార్‌డంతో సినిమా ఫ్లాప్‌ అయినా కూడా మినిమం కలెక్షన్స్‌ వస్తాయి.తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్‌లో మహేష్‌బాబు క్రేజ్‌ ఆకాశాన్ని అంటేలా ఉంది.అందుకే భరత్‌ అనే నేను చిత్రం సక్సెస్‌ టాక్‌ను దక్కించుకున్న నేపథ్యంలో రికార్డు స్థాయి కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి.మరో రెండు మూడు రోజుల్లో టాలీవుడ్‌ నెం.3 స్థానంకు భరత్‌ చేరడం ఖాయం అయ్యింది.

కొరటాల శివ దర్శకత్వంలో దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ నటించిన విషయం తెల్సిందే.

మహేష్‌బాబు సీఎంగా నటించడంతో అంతా కూడా ఈ సినిమాపై ఆసక్తిని కనబర్చారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంది.

దేవిశ్రీ అందించిన సంగీతంతో పాటు ప్రతి ఒక్కటి కూడా సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.అందుకే ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను సాధించిందని చెప్పుకోవచ్చు.

పైగా కొరటాల శివ స్టార్‌డం కూడా కలెక్షన్స్‌కు కారణం కావచ్చు.ఇలా అన్ని కలిసి భరత్‌ను టాప్‌ పొజీషన్‌లో ఉంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube