నాకు చిరంజీవి బైక్ నేర్పించాడు.. ఆ విషయం చెప్పేసిన భానుచందర్?

నిన్నటి తరం హీరోలలో ఒక వెలుగు వెలిగి స్టార్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన వారిలో భానుచందర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.కేవలం తెలుగులో మాత్రమే కాదు కన్నడ తమిళ భాషల్లో కూడా చాలా సినిమాల్లో నటించారు ఆయన.

 Bhanu Chandar About Chiranjeevi-TeluguStop.com

ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు ఇక ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తన పాటలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు తనయుడే ఈ భానుచందర్ అన్న విషయం తెలిసిందే.మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మంచి పట్టు ఉండడంతో ఇక కెరీర్ ఆరంభంలోనే యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాడు భానుచందర్.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుచందర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.నేను హీరో అవుతానని నా తండ్రికి ఎప్పుడూ ఉండేది కాదు.కానీ మా అమ్మ మాత్రం నేను హీరో అవుతానని నమ్మింది.మ్యూజిక్ డైరెక్టర్ గా మా నాన్నకు రావాల్సిన గుర్తింపు రాలేదు.

తెర వెనకే ఉండిపోయారు.అందుకే నేను తెరమీద హీరోగా కనిపించాలీ అని అనుకున్నాను.

ఫ్రెండ్స్ మాత్రం నువ్వు హీరో ఏంట్రా అని ఎగతాళి చేసేవారు.నాన్నల సంగీతం నేర్చుకో ఉచిత సలహాలు ఇచ్చేవారు.

కానీ నేనుహీరో అయ్యి చూపిస్తాను అంటూ వారితో ఛాలెంజ్ చేశాను.

Telugu Bhanu Chandar, Bike, Chiranjeevi, Mukku Pudaka, Nireekshana, Rajanikanth,

తరంగిణి సినిమా తర్వాత నా ఫ్రెండ్ కి ఆ సినిమాకు తీసుకు వెళ్లాను.నా నటన చూసి చాలా గొప్పగా చేశావంటూ మెచ్చుకున్నారు.ఆ తర్వాత ముక్కు పుడక, స్వాతి, నిరీక్షణ లాంటి సినిమాలలో మంచి గుర్తింపు వచ్చింది.

రజినీకాంత్ నాకు మార్గదర్శి.ఆయన స్ఫూర్తి తీసుకొని నేను హీరోగా నిలదొక్కుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు భానుచందర్.

చిరంజీవి నేను రూమ్ మేట్స్ గా ఉండేవాళ్ళం.నేను బైక్ నేర్చుకోవాలని అనుకున్నపుడు నాకు రాయల్ ఎన్ఫీల్డ్ నడపడం నేర్పించింది మెగాస్టార్ చిరంజీవినె అంటు గుర్తుచేసుకున్నారు.

ఇక చిరంజీవి నాకు మధ్య ఇప్పటికి కూడా అదే ఫ్రెండ్షిప్ ఉంది.ఏరా ఏరా అనుకుంటూ ఉంటాం.

ఎక్కడ కలిసిన ఆప్యాయంగా పలకరించుకుంటాం.అందరికీ అతను మెగాస్టార్ అయితే నాకు మాత్రం మంచి స్నేహితుడు అంటూ భానుచందర్ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube