'భగవంత్ కేసరి' నుండి ఆ స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. వైరల్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి’‘.( Bhagavanth Kesari ).సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోగా ఈ మధ్య వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేస్తూ పోతున్నాయి.

 Bhagavanth Kesari Working Stills, Bhagavanth Kesari, Anil Ravipudi, Kajal Agg-TeluguStop.com

ఈ సినిమాతో బాలయ్య కూడా హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు.దసరా బరిలో భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.వరుసగా సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.మరి తాజాగా మరోసారి మేకర్స్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

మేకర్స్ షూటింగ్ సమయంలో సెట్స్ లో తీసిన కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ పిక్స్ లో కాజల్, శ్రీలీలతో ( Sreeleela )పాటు బాలయ్య, డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi )ఉన్నారు.

సెట్స్ లో దిగిన ఈ ఫొటోస్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.దీంతో నెట్టింట వైరల్ అయ్యాయి.

కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ ( Thaman )సంగీతం అందించారు.చూడాలి బాలయ్య హ్యాట్రిక్ కోరిక నెరవేరుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube