వైజాగ్ లో 'భగవంత్ కేసరి' ర్యాంపేజ్ మామూలుగా లేదుగా!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”( Bhagavanth Kesari ). అఖండ, వీరసింహారెడ్డి వంటి హిట్స్ తర్వాత బాలయ్య ఈ సినిమాతో వస్తుండడంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు నెలకొన్నాయి.

 Bhagavanth Kesari Movie Records In Vizag, Balakrishna, Vizag, Anil Ravipudi, Bha-TeluguStop.com

అందులోను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండడంతో పక్కా హిట్ అని ఫ్యాన్స్ ముందే ఫిక్స్ అయ్యారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Agarwal, Sreeleela, Vizag-Movie

అయితే గత రెండు సినిమాలు భారీ యాక్షన్ సినిమాలుగా అలరిస్తే ఇప్పుడు బాలయ్య( Balakrishna ) చేస్తున్న భగవంత్ కేసరి మాత్రం యాక్షన్ తో పాటు ఎమోషన్స్ అండ్ ఫన్ కూడా మిక్స్ అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.బాలయ్యను పవర్ ఫుల్ గా చూపిస్తూనే ఎమోషన్స్, ఫన్ అన్ని ఉండేలా అనిల్ చక్కగా ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు ప్రమోషనల్ కంటెంట్ తో రుజువయ్యింది.

దీంతో నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) తో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

మరి ఎట్టకేలకు వీరంతా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.రేపు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇక ఈ సినిమా మ్యానియా వైజాగ్ లో నెక్స్ట్ లెవల్లో ఉంది అనే చెప్పాలి.రేపు అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుండగా వైజాగ్( Vizag ) మొత్తం సింగిల్ స్క్రీన్స్ లో 40కి పైగానే షోస్ పడనున్నాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Agarwal, Sreeleela, Vizag-Movie

మరి 40 షోస్ కు కూడా హౌస్ ఫుల్స్ పడిపోయాయి.దీంతో బాలయ్య మ్యానియా( Balayya Mania ) వైజాగ్ లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కాగా దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube