గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా అనుకరిస్తే ఇలా గల్లంతైపోతారు జాగ్రత్త!

గూగుల్ మ్యాప్స్ తెలియని యువత ఉండదనే చెప్పుకోవాలి.వాటి వినియోగం లేకుండా ఇపుడు మనిషి ఓ అడుగు ముందుకు వేయలేకపోతున్నాడనే చెప్పుకొని తీరాలి.

 Beware Of Blindly Mimicking Google Maps , Google Maps, Car Travel , Us, Uk, Japan, Satish Ghoole, Ahmednagar-TeluguStop.com

మనం తెలియని ప్రదేశానికి ప్రయాణించాలన్నా లేదా ట్రాఫిక్ ఫ్రీ రూట్ ఎంచుకోవాలన్నా ముందుగా గూగుల్ మ్యాప్స్ సాయం తీసుకోవలసిందే.అయితే ఈ ప్లాట్‌ఫామ్ అన్ని దేశాలలో ఒకేలాగా పని చేయకపోవచ్చు.

ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి US, UK, జపాన్ మొదలగు దేశాలలో గూగుల్ మ్యాప్స్ చాలా అద్భుతంగా పని చేస్తాయి.మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని అవి 100% నిర్దేశిస్తాయి.

 Beware Of Blindly Mimicking Google Maps , Google Maps, Car Travel , US, UK, Japan, Satish Ghoole, Ahmednagar-గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా అనుకరిస్తే ఇలా గల్లంతైపోతారు జాగ్రత్త-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనదగ్గర అలాకాదు.

ముఖ్యంగా మన భరత్ లో కొన్ని పరిస్థితుల్లో పూర్తిగా గూగుల్ పై ఆధారపడకుండా సొంత టాలెంట్ ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

లేదంటే చాలా ఇబ్బందులకు గురికాక తప్పదు.ఇప్పుడు అలాంటి ఓ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం.తాజాగా ఓ కార్ డ్రైవర్ గూగుల్ నావిగేషన్‌ను నమ్ముకొని ఏకంగా వాగులోకి దూసుకెళ్లాడు.వివరాల్లోకి వెళితే, ఫార్చూనర్‌ కారులో కేరళ పర్యటనకు బయలుదేరిన ఓ టూరిస్ట్ బృందం.

గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు.మున్నార్ నుంచి అలప్పుజాకు వెళ్తుండగా మారుమూల గ్రామమైన కురుప్పంతర కడవు చేరుకున్నారు.

అక్కడి నుంచి నేరుగా వెళ్లాలని సూచించిన మ్యాప్‌ ఇండికేషన్‌తో వేగంగా ముందుకెళ్లారు.కానీ వాళ్లు ప్రయాణిస్తున్న కారు డైరెక్ట్‌గా ఒక వాగులోకి దూసుకెళ్లింది.వెంటనే స్థానికులు అప్రమత్తమై సాయం చేయడంతో ఎవరికి గాయాలు కాలేదు.కాగా భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సదరు గ్రామ పంచాయతీ అక్కడ గొలుసుకట్టును ఏర్పాటు చేసింది.

*గతేడాది గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి 34 ఏళ్ల సతీష్ ఘూలే అనే వ్యక్తి నీట మునిగి చనిపోయాడు.అతను అహ్మద్‌నగర్‌లోని అకోలే పట్టణంలో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి నీళ్లలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.

గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా అనుకరించకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవడం అందరికీ మంచిది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube