చలికాలంలో పెదాలకు అండగా నెయ్యి.. ఇలా రాస్తే మీ లిప్స్ మెరిసిపోతాయ్!

చలికాలం ప్రారంభమైంది.చలి కొంచెం కొంచెంగా పెరుగుతోంది.

అయితే ఈ సీజన్ లో ప్రధానంగా వేధించే సమస్యల్లో పెదాల పగుళ్లు( Cracked lips ) ఒకటి.

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా పెదాలు తరచూ డ్రై అయిపోతుంటాయి.

పగుళ్లు ఏర్పడతాయి.దీంతో పెదాలు నిర్జీవంగా కనిపిస్తాయి.

ఇటువంటి పెదాలను రిపేర్ చేసుకోవడం చాలా ముఖ్యం.అయితే అందుకు నెయ్యి అద్భుతంగా సహాయపడుతుంది.

Advertisement

చలికాలంలో నెయ్యి పెదాలకు అండగా నిలుస్తుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా నెయ్యిని లిప్స్ కి రాస్తే సహజంగానే అందంగా కోమలంగా మెరిసిపోతాయి.

అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి, ( Ghee )వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి.ఈ రెండిటిని కరిగేంత వరకు హీట్ చేసుకుని ఒక బాక్స్ లో పోసుకోవాలి.రెండు గంటల పాటు వదిలేస్తే మంచి లిప్ బామ్ రెడీ అవుతుంది.

నెయ్యి, కొబ్బరి నూనె గ్రేట్ కాంబినేషన్ అని చెప్పాలి.ఈ రెండిటిని కలిపి పెదాలకు రాస్తే పగుళ్ల సమస్య దూరం అవుతుంది.

లిప్స్ హైడ్రేటెడ్ గా ఉంటాయి.మృదువుగా కోమలంగా మెరుస్తాయి.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

అలాగే నెయ్యిని ఈ చలికాలంలో పెదాలకు మరొక విధంగా కూడా ఉపయోగించవచ్చు.అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ షియా బటర్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్,( coconut oil ) హాఫ్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్ ( Beet root powder )వేసుకుని ఒక నిమిషం పాటు గ్రైండ్‌ చేసుకోవాలి.తద్వారా మంచి లిప్ క్రీమ్ సిద్ధం అవుతుంది.

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ లిప్ క్రీమ్ ను రోజుకు రెండుసార్లు పెదాలకు అప్లై చేసుకోవాలి.ఈ న్యాచురల్ క్రీమ్ మీ పెదాలను తేమగా ఉంచుతుంది.

డ్రై అవ్వకుండా రక్షిస్తుంది.పగుళ్ళ సమస్య దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

అలాగే ఈ క్రీమ్‌ మీ పెదాలను ఎర్రగా కాంతివంతంగా మారుస్తుంది.అందంగా మెరిసేలా సైతం చేస్తుంది.

తాజా వార్తలు