ఐరన్ రిచ్ గా ఉండే ఈ ఐదు రకాల పండ్లు తింటే రక్తహీనత మీ దరిదాపుల్లోకి కూడా రాదు!

ఇటీవల కాలంలో చాలా మంది రక్తహీనత సమస్య( Anemia problem )తో బాధపడుతున్నారు.శరీరంలో ఐరన్ కొరత కారణంగా హిమోగ్లోబిన్ శాతం డౌన్ అవుతుంది.

ఫలితంగా రక్తహీనత బారిన పడతారు.దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో జబ్బులు చుట్టుముడతాయి.

అందుకే రక్తహీనతను నివారించుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ కొన్ని కొన్ని ఆహారాల ద్వారా కూడా రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.

ముఖ్యంగా ఐరన్ రిచ్ గా ఉండే ఐదు రకాల పండ్లు ఉన్నాయి.వీటిని డైట్ లో చేర్చుకుంటే రక్తహీనత మీ దరిదాపుల్లోకి కూడా రాదు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఐరన్ రిచ్ పండ్లు ఏవేవో తెలుసుకుందాం పదండి.

అత్తిపండ్లు లేదా అంజీర్.( Figs ) ఈ మధ్యకాలంలో అత్యంత ప్రజాదారణ పొందిన పండ్ల‌లో ఒకటి.అత్తిపండ్లు పోషకాలకు పవర్ హౌస్ లాంటివి.

ముఖ్యంగా అత్తిపండ్లలో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.రోజుకు ఒక అత్తి పండును తీసుకుంటే రక్తహీనత దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.గుండెపోటు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

అలాగే ఐరన్ పుష్కలంగా ఉండే పండ్లలో దానిమ్మ ముందు వరుసలో ఉంటుంది.నిత్యం దానిమ్మ పండును తింటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ అందుతుంది.

Advertisement

హిమోగ్లోబిన్ శాతం పెరిగి రక్తహీనత దూరం అవుతుంది.ఖర్జూరం పండులో కూడా ఐరన్ కంటెంట్ రిచ్ గా ఉంటుంది.

రక్తహీనతకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఖర్జూరం పండును డైట్ లో చేర్చుకోండి.

అలాగే స్ట్రాబెర్రీ పండ్లు ( Strawberry )ఐరన్ తో సహా వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి.తరచూ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల రక్తహీనత దూరం అవ్వడమే కాదు మరెన్నో లాభాలు మీ సొంతమవుతాయి.ఇమ్యూనిటీ బూస్టర్ గా సైతం స్ట్రాబెరీ పండ్లు ప‌ని చేస్తాయి.

ఇక పుచ్చకాయలో నీరు తప్ప ఏమీ ఉండదని భావిస్తుంటారు.కానీ పుచ్చకాయలో నీరుతో పాటు వివిధ పోషకాలు ఉంటాయి.

అందులో ఐరన్ కూడా ఒకటి.వారానికి రెండు మూడు సార్లు పుచ్చకాయ ని తీసుకుంటే ఐరన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.

రక్తహీనత మీ దరిదాపుల్లోకి చేరకుండా ఉంటుంది.

తాజా వార్తలు