టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) నటుడు కమెడియన్ సునీల్( Sunil ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కూడా మనందరికీ తెలిసిందే.
ఇప్పటికే చాలా సందర్భాలలో వీరిద్దరూ వారి మధ్య ఉన్న స్నేహం గురించి బయటపెట్టారు.గతంలో వీరిద్దరూ కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతున్నారు.అవకాశం వస్తే మళ్లీ సినిమా చేయాలని ఇద్దరూ అనుకుంటున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో కలిసి పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.సునీల్ కమెడియన్ గా విలన్ గా నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.కాగా వీరిద్దరూ ఇండస్ట్రీకి రాక ముందు నుంచి అలాగే ఇండస్ట్రీలకు వచ్చిన తర్వాత ప్రారంభంలో కూడా కలిసే ఉన్నారు.
హైదరాబాద్‌లోని పంజాగుట్ల సమీపంలో ఒకే రూమ్‌లో ఉన్నారు.చాలా కాలం పాటు ఈ ఇద్దరు అవకాశాల కోసం స్ట్రగుల్ అయ్యారు.ఆ రూమ్‌లో ఎన్నో బాధలు చూశారు, ఆనందాలు చూశారు.అందుకు గుర్తుగా ఆ రూమ్‌ని ఇప్పటికీ అలానే ఉంచి రెంట్ కడుతున్నారు.
అంత గొప్ప స్నేహం వీరిద్దరిది.అయితే ఆ స్నేహాన్ని పెళ్లి రూపంలోనూ చూపించడం కూడా నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయం అని చెప్పవచ్చు.
త్రివిక్రమ్, సునీల్ పెళ్లి కూడా ఒకేసారి జరగడం ఒక విశేషమైతే, ఒకే రోజు, కొన్ని గంటల వ్యవధిలోనే జరగడం మరో విశేషం.అది కూడా హైదరాబాద్ లోనే. త్రివిక్రమ్ 2002లో అక్టోబర్ 11న సాయి సౌజన్యని( Sai Sowjanya ) పెళ్లిచేసుకున్నారు.ఆమె ఒక క్లాసికల్ డాన్సర్.ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు రామశాస్త్రి కుమార్తె.వీరి వివాహం మధ్యాహ్నం శ్రీనగర్ లోని వచ్చేసాయి నిగమమాగంలో జరిగింది.
ఆ సమయంలోనే త్రివిక్రమ్ నువ్వే నువ్వే చిత్రంతో దర్శకుడిగా కూడా మారారు.సరిగ్గా అదే రోజు అక్టోబర్ 11నే సునీల్ వివాహం శృతితో( Shruti ) జరిగింది.
సాయంత్రం ఏడు గంటలకు హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద గల సైబర్ గార్డెన్‌లో జరిగింది.
వీరి పెళ్లికి కూడా సినీ ప్రముఖులు భారీగానే హాజరయ్యారు.అప్పుడే నటుడిగా నిలబడుతున్నాడు సునీల్.కమెడీయన్‌గా అలరిస్తున్నారు.
ఇలా ఈ ఇద్దరు స్నేహితులు పెళ్లిళ్ల విషయంలోనూ తమ స్నేహాన్ని చాటుకున్నారు.కానీ ఒకరి పెళ్లి మరొకరు చూసుకోలేకపోవడం బాధాకరం.
అయితే ఈ ఇద్దరి పెళ్లి ఒకేసారి జరిగిందనేది సినీ పెద్దలకు, ముందు జనరేషన్ వాళ్లకి తెలిసే ఉంటుంది.కానీ నేటి తరానికి మాత్రం ఆసక్తికర విషయమనే చెప్పాలి.
అందుకే వీరి మ్యారేజ్‌కి సంబంధించిన ఒక వార్తా క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఓ వార్తా పత్రికలో ఈ ఇద్దరు పెళ్లిళ్ల న్యూస్‌ని కవర్ చేశారు.
దీంతో ఇది ఆసక్తికరంగా మారింది.