ఈ 4 ఆహారాలు డైట్‌లో ఉంటే మీ జుట్టు సేఫ్‌..!

హెయిర్ ఫాల్‌.స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ తీవ్రంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య ఇది.

ఈ స‌మ‌స్య‌ను నియంత్రించ‌డం కోసం త‌ర‌చూ హెయిర్ ఆయిల్స్‌, షాంపూస్‌ల‌ను మారుస్తుంటారు.వారానికి రెండు మూడు సార్లు హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.

అయినా స‌మ‌స్య అదుపులోకి రాకుంటే ఏం చేయాలో అర్థంగాక హాస్ప‌ట‌ల్స్ చుట్టూ తిరుగుతుంటారు.మందులు సైతం వాడుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే నాలుగు ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి మందులు వాడ‌కుండానే హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

ఉసిరికాయ‌.ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.జుట్టుకూ ఉసిరి ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

Advertisement

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ‌ల పొడి క‌లిపి తీసుకోవాలి.లేదా ఎండ‌బెట్టిన ఉసిరికాయ ముక్క‌ల‌ను తినాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మీ జుట్టు సేఫ్‌.ఉసిరికాయ‌ల్లో ఉండే ప్ర‌త్యేక సుగుణాలు జుట్టుకు బ‌లాన్ని చేకూరుస్తుంది.

దాంతో హెయిర్ ఫాల్ స‌మ‌స్య దూరం అవుతుంది.వైట్ హెయిర్ త్వ‌ర‌గా రాకుండా ఉంటుంది.

అలాగే జుట్టు ఆరోగ్యంగా, స్ట్రోంగ్‌గా ఉండాలంటే డైట్‌లో డ్రైఫ్రూట్స్ ను త‌ప్ప‌నిస‌రిగా చేర్చుకోవాలి.ముఖ్యంగా బాదం ప‌ప్పు, వాల్‌న‌ట్స్‌, జీడిప‌ప్పు, పిస్తా ప‌ప్పు వంటి వాటిని తీసుకోవాలి.హెయిర్ ఫాల్‌ను నివారించి జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా పెంచ‌డంలో బచ్చలికూర గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాబ‌ట్టి, వారంలో రెండు లేదా మూడు సార్లు ఖ‌చ్చితంగా బ‌చ్చ‌లికూర‌ను తినాల‌ని నిపుణులు చెబుతున్నారు.బుచ్చ‌లికూర శ‌రీరానికి కావాల్సిన పోష‌కాలను సైతం అందిస్తుంది.బీన్స్ కూడా జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌ను నివారించ‌గ‌ల‌దు.

Advertisement

బీన్స్‌లో పోష‌కాలు మెండుగా ఉంటాయి.వీటిని త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల జుట్టు రాల‌కుండా ఉంటుంది.

మ‌రియు కేశాలు షైనీగా కూడా మెరుస్తాయి.

తాజా వార్తలు