తన నేషనాలిటీని దాచి ఓ భార్య తాజాగా చిక్కుల్లో పడింది.పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు.
కానీ కోల్‌కతాకు( Kolkata ) చెందిన వ్యాపారవేత్త తబీష్ ఎహ్సాన్( Tabish Ehsan ) మాత్రం గుడ్డిగా ఒక ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు.తర్వాత అసలు సంగతి తెలిసి షాక్ కావడం అతడి వంతు అయ్యింది.
వివరాల్లోకి వెళితే, తబీష్ ఎహ్సాన్ 2009లో నాజియా అంబ్రీన్ ఖురైషీని( Nazia Ambreen Quraishi ) వివాహం చేసుకున్నాడు.నాజియా తనను తాను భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌కు( Uttar Pradesh ) చెందిన నివాసిగా పరిచయం చేసుకుంది.
వివాహమైన 14 సంవత్సరాల తర్వాత, నాజియా బంగ్లాదేశ్ జాతీయురాలు( Bangladeshi Citizenship ) అని తబీష్ కనుగొన్నాడు.భారత పౌరసత్వం పొందేందుకు నాజియా తనను ఉపయోగించుకుందని తబీష్ అభిప్రాయపడ్డాడు.
అతను ఆమెపై ఐసీపీ సెక్షన్ 120బి, 465, 467, 471, 363, ఫారినర్ యాక్ట్ సెక్షన్ 14 ఎ(బి), పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 17 కింద కేసులు నమోదు చేయించాడు.
నాజియా తనను పెళ్లి చేసుకోకముందే బంగ్లాదేశ్‌లోని ఓ స్కూల్ టీచర్‌ని పెళ్లి చేసుకున్నట్లు తబీష్ పేర్కొన్నాడు.ఆమె మొదటి భర్త నుంచి బలవంతంగా విడాకులు తీసుకుందని ఆరోపించాడు.తప్పుడు ఆరోపణలు, రాజకీయ ప్రభావానికి గురిచేసి తన మొదటి భర్తను నాజియా అనేక ఇబ్బందులు కలిగించిందని అన్నాడు.
ఆ తర్వాత నాజియా, ఆమె కుటుంబం ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా భారత్‌కు తరలివెళ్లారు.
నాజియాతో తన వివాహం భారత పౌరసత్వం( Indian Citizenship ) పొందడం కోసం ఆమె చేసిన కుట్రలో ఒక భాగం మాత్రమేనని తబీష్ అభిప్రాయపడ్డాడు.సాక్ష్యాధారాలను అధికారులకు అందించినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విస్తుపోయాడు.నాజియా పాస్‌పోర్ట్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.