ఏడిస్తే కూడా లాభాలున్నాయా ?

జనరల్ గా జనాలు ఎందుకు ఏడుస్తారు ? బాధేస్తే ఆపుకోలేక ఏడుస్తారు .ఏడిస్తే అయినా బాధంతా మర్చిపోతామేమో అనే ఆశతో ఏడుస్తారు.

అందులో అబద్ధం లేదు.ఏడిస్తే ఏదో మోస్తున్న బరువుని కింద దించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

మానసికంగానే కాదు, కన్నీరు కార్చడం వలన శారీరక లాభాలు కూడా ఉన్నాయి.* కంట్లో ఏదైనా చిన్నపాటి దుమ్ము పడితే ఆటోమేటిక్ గా కన్నీరు వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? ఇది లాక్రిమల్ గ్లాండ్స్ చేసే పని.దుమ్ము, ఇరిటెంట్స్ నుంచి మీ కంటిని కాపాడడానికి అలాంటి సమయాల్లో కన్నీరు బయటకివస్తుంది.కన్నీరు కార్చడం వలన ఇరిటెంట్స్ దూరమయ్యి, కంటిచూపు బలపడుతుంది.

* కన్నీరు ద్వారా కూడా కొన్నిరకాల టాక్సీన్స్ శరీరంలోంచి బయటకివస్తాయని కొన్ని పరిశోధనలు తెలిపాయి.* మన కన్నీరులో లిసోజిమ్స్ అనే యాంటిబ్యాక్టిరియా ఉంటుంది.

Advertisement

ఇది కంటిలో ఉండిపోయిన బ్యాక్టీరియాని చంపుతుంది.ఈ లిసోజిమ్స్ ఒకేసారి 90% క్రిములను చంపేస్తాయి.

* ఎప‍్పుడైన గమనించారో లేదో, ఎక్కువగా ఏడిస్తే మన ముక్కు ఎర్రగా, పచ్చిగా అయిపోతుంది.టియర్ డక్ట్స్ ముక్కుని మాయిశ్చరైజ్ చేసి, క్రిముల్ని తొలగించినప్పుడు ఇలా అవుతుంది.

* ఇవి కాకుండా మానసిక లాభాలు చూస్తే, కన్నీరు ఎమోషన్స్ ని బయటపెట్టడానికి ఉపయోగపడతాయి.అప్పుడప్పుడు మూడ్ ని బాగు చేస్తాయి.

ఒక్కోసారి స్ట్రెస్ ని పోగొడతాయి.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు