బెల్లంకొండ కి ఎన్ని కోట్ల ఆస్థి ఉందో తెలుసా.. ?

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు.

 Bellamkonda Srinivas Properties Details, Bellamkonda Srinivas, Leicesterberg The-TeluguStop.com

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తి గత విషయానికి వస్తే.ఆయన 1993జనవరి 3న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారు.

సాయి శ్రీనివాస్ తల్లిదండ్రులు బెల్లంకొండ సురేష్, పద్మ.ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వయస్సు 28ఏళ్ళు.

శ్రీనివాస్ ని శ్రీను, బాబు అనే ముద్దుపేర్లతో పిలుస్తారు.ఇతడికి సాయి గణేష్ అనే సోదరుడు ఉన్నాడు.

ఇక అల్లుడు శీను మూవీతో హీరోగా వచ్చి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.ఇక శ్రీనివాస్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని భారతీయ విద్యాభవన్ లో చదువుకున్నాడు.

యుఎస్ లోని లాస్ ఏంజిల్స్ లోగల లీస్టార్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శ్రీనివాస్ తన విద్యను పూర్తి చేశారు.

Telugu Alludu Srinu, Sakhyam, Speedunnodu, Vv Vinayak-Telugu Stop Exclusive Top

ఇక శ్రీనివాస్ కి చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టంతో తండ్రితో పాటు షూటింగ్స్ కి వెళ్లడం, సినిమాలు చూడడం చేసేవాడు.హీరోగా చేస్తానని తండ్రితో చెప్పడంతో స్టడీస్ అయ్యాక అని అతడికి పర్మిషన్ ఇచ్చారు.ఇక యాక్టింగ్ కోర్సు పూర్తిచేసిన శ్రీనివాస్ 20ఏళ్ళ వయస్సులోనే వివి వినాయక్ డైరెక్షన్ లో అల్లుడు శీను మూవీతో 2014లో హీరోగా ఇండస్ట్రీకి తెరంగ్రేటం చేశాడు.

Telugu Alludu Srinu, Sakhyam, Speedunnodu, Vv Vinayak-Telugu Stop Exclusive Top

ఇక శ్రీనివాస్ 2016లో స్పీడున్నోడు, 2017లో జయ జానకి నాయక , 2018లో సాక్ష్యం, 2019లో రాక్షసుడు, తాజాగా అల్లుడు అదుర్స్ మూవీస్ తో హీరోగా శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.శ్రీనివాస్ తొలిసినిమాకు 1.2కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు.ఇక రాక్షసుడు మూవీకి 7.3కోట్లు తీసుకున్నట్లు సమాచారం.అతడికి ప్రభాస్ ఇష్టమైన హీరో.

ఇక అభిమాన హీరోయిన్ సమంత.ఇష్టమైన ప్రదేశం ఢిల్లీ.

యాక్టింగ్,డాన్స్, స్విమ్మింగ్ అంటే ఇష్టపడుతుంటారు.ఇక నెట్ వర్త్ 280కోట్లు ఉంటుందని సమాచారం.

అంతేకాదు ఇతడికి మూడు అధునాతన కార్లు ఉన్నాయి.ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మూడు కోట్ల విలువైన కూడా ఇల్లు ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube