సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో టైం లో ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది కొద్ది రోజులు కొన్ని జానర్స్ సినిమాలు నడిస్తే మరికొన్ని రోజులు వేరే జానర్స్ సినిమాలు నడుస్తాయి ప్రేక్షకుల మైండ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు.అయితే ఇప్పుడు రి రిలీజ్ సినిమా లా ట్రెండ్ నడుస్తోంది.
వల్ల అభిమాన హీరోల హిట్ సినిమాలని మళ్ళీ రిలీజ్ చేసి భారీ వసూళ్లను రాబడుతున్నారు అందులో భాగంగా గానే తాజాగా రామ్ చరణ్ ( Ram Charan )నటించిన ఆరంజ్( Orange ) , ఎన్టీఆర్ ( NTR )నటించిన ఆంధ్రా వాలా( Andhra Vala ) ఆడియెన్స్ ముందుకు వచ్చాయి .ఈ రెండు చిత్రాలు కూడా తొలిసారి విడుదల సమయంలో డిజాస్టర్ అయ్యాయి.

అయితే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆరెంజ్ ని థియేటర్లలోకి తీసుకువచ్చారు.ఈ స్పెషల్ షోస్‌కి భారీ స్పందన వచ్చింది .ఈ చిత్రం ఈ స్పెషల్ షోస్ ద్వారా సుమారు 3 కోట్లకు పైగా కలెక్షన్స్‌ని రాబట్టి.సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
ఇదే సమయంలో ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆంధ్రావాలా సినిమా స్పెషల్ షోస్ ని వేశారు .అయితే ఈ మూవీకి ఏ మాత్రం రెస్పాన్స్ రాలేదు, దీనితో ఎన్టీఆర్ మూవీకి వచ్చిన కలెక్షన్స్‌ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.సీడెడ్‌లో 500, ఆంధ్రాలో 600 , నైజాంలో 400 అంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ పోస్టర్‌తో తారక్‌ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా టైమ్‌లో తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య ఎటువంటి యుద్ధం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుసినిమాలోని చరణ్, తారక్ పాత్రలపై కూడా ఫ్యాన్స్ గొడవలు పడ్డారు.ఇప్పుడు ఈ స్పెషల్ షోస్ విషయంలో తారక్‌ని అవమానిస్తూ.
ఫ్లాప్ సినిమాతో కూడా రికార్డులు కొట్టగల సత్తా మాది అనేలా కొందరు మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఆరెంజ్ స్పెషల్ షోస్ చరణ్ బర్త్‌డేకి విడుదల చేశారు.
ఈ షోస్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ మొత్తం జనసేన పార్టీకి ఇస్తామని ప్రకటించారు….

అందువల్లే ఆ సినిమాకి ఆదరణ లభించింది.కానీ ఆంధ్రావాలా విషయంలో స్పెషల్ షోస్ వేస్తున్నారనే విషయంగానీ, పలానా రోజు నుంచి అనిగానీ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించలేదు.అందుకే ఇటువంటి రిజల్ట్ వచ్చిందంటూ.
త్వరలో మేమేంటో చూపిస్తామని తారక్ ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు.తారక్ పుట్టినరోజున రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింహాద్రి చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు భారీగా ప్లాన్ చేస్తున్నారు… ఆ సినిమాతో తమ పవర్ చూపిస్తామని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు .అయితే ఇద్దరు హీరోలు స్నేహంగా ,అన్నదమ్ముల్లా కలసి ఉంటున్నారని .మధ్యలో ఈ ఫ్యాన్ వార్ ఎందుకు అనే వారు లేకపోలేదు…
.