క‌మ‌లా పండు తొక్క‌లు పారేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

క‌మ‌లా పండ్లు .ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

తియ్యగా, పుల్లగా ఉండే క‌మ‌లా పండ్లు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

అయితే సాధార‌ణంగా క‌మ‌లా పండ్ల విష‌యంలో అంద‌రూ చేసే పొర‌పాటు తొక్క‌ను పారేయడం.

వాస్త‌వానికి క‌మలా పండు తొక్క‌ల్లో బోలెడ‌న్ని సౌంద‌ర్య ప్ర‌యోజ‌నాలు దాగున్నాయి.చర్మానికి మెరుపును అందించడంలో, మొటిమ‌లు మ‌రియు మ‌చ్చ‌లు దూరం చేయ‌డంలో క‌మ‌లా పండు తొక్క‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి వీటిని ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు క‌మ‌లా తొక్క‌ల‌ను ఎండ‌పెట్టి పొడి చేసుకుని ఒక డ‌బ్బాలో పోసుకోవాలి.

Advertisement
Beauty Benefits With Orange Peel! Beauty Tips, Latest News, Irange Peel, Beauty,

ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ క‌మ‌లా తొక్క‌ల పొడి, అర టీ స్పూన్ పెరుగు మ‌రియు నిమ్మ ర‌సం వేసి బాగా క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మెడ‌కు ప‌ట్టించి.

పావు గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గి.చ‌ర్మ ఛాయ మెరుగుప‌డుతుంది.

Beauty Benefits With Orange Peel Beauty Tips, Latest News, Irange Peel, Beauty,

రెండొవ‌ది.ఒక బౌల్‌లో ఒక స్పూన్ ఎండ‌బెట్టిన కమ‌లా పండు తొక్క పొడి, రోజ్ వాట‌ర్, చిటికెడు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకున్న మలినాలు పోయి.తాజాగా, కాంతివంతంగా మారుతుంది.

మూడొవ‌ది.ఒక బౌల్‌లో ఎండ‌బెట్టిన కమ‌లా పండు తొక్క పొడి, కొద్దిగా పాలు మ‌రియు తేనె వేసి క‌లుపుకోవాలి.

అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి.ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు త‌గ్గి.

ముఖం మృదువుగా, య‌వ్వ‌నంగా మారుతుంది.

తాజా వార్తలు