ముఖాన్ని మిల‌మిలా మెరిపించే జొన్న పిండి.. ఎలాగంటే?

జొన్న‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.పూర్వ కాలం చాలా మంది జొన్న‌ల‌ను అన్నంగా వండుకునే తినేవారు.

జొన్న‌ల్లో ఫైబ‌ర్‌, కాల్షియం, పొటాషియం, పాస్పరస్, జింక్, కాప‌ర్‌, విట‌మిన్ బి మ‌రియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.ఇన్ని పోష‌కాలు నిండి ఉన్న జొన్న‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు, క్యాన్స్‌ర్‌, ర‌క్త‌పోటు, ర‌క్త‌హీన‌త వంటి స‌మ‌స్య‌ల‌కు దూరం ఉండొచ్చు.

ఇక ఆరోగ్య ప‌రంగానే కాకుండా.సౌంద‌ర్య ప‌రంగానూ జొన్న‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అవును, ముఖాన్ని మిల‌మిలా మెరి‌పించ‌డంలో, ముఖంపై మొటిమ‌లు తొలిగించ‌డంలో, డార్క్ స్పాట్స్‌ను దూరం చేయ‌డంలో జొన్నలు సూప‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.మ‌రి వీటిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Beauty Benefits Of Sorghum! Beauty, Benefits Of Sorghum, Sorghum, Latest News, S

ముందుగా జొన్న‌ల‌ను పిండి చేసుకుని పెట్టేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో జొన్న పిండి మ‌రియు నిమ్మ ర‌సం మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై మృత‌క‌ణాలు, మ‌లినాలు పోయి.ప్ర‌కాశవంతంగా మెరుస్తుంది.

Beauty Benefits Of Sorghum Beauty, Benefits Of Sorghum, Sorghum, Latest News, S

రెండొవ‌ది.ఒక బౌల్‌లో జొన్న‌ పిండి, కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.

న్యూస్ రౌండప్ టాప్ 20

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Advertisement

ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ మ‌రియు ముడ‌త‌లు పోయి.య‌వ్వ‌నంగా మారుతుంది.

మూడొవ‌ది.ఒక బౌల్‌లో కొద్దిగా జొన్న పిండి, చంద‌నం పొడి మ‌రియు వాట‌ర్ మిక్స్ చేసి.

ముఖానికి ప‌ట్టించాలి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

మొటిమ‌లు క్ర‌మంగా త‌గ్గిపోయి ముఖం అందంగా మారుతుంది.

తాజా వార్తలు