దేశ రాజకీయాల్లోకి కేసిఆర్ ( KCR ) ఎంట్రీ ఇచ్చిన తరువాత యమ దూకుడు ప్రదర్శించారు.బిజెపి ముక్త్ భారత్ నినాదాన్ని( BJP’s slogan is Mukt Bharat ) ఆలపిస్తూ బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తూ వచ్చారు.
నితిశ్ కుమార్, అఖిలేశ్ యాదవ్( Nitish Kumar, Akhilesh Yadav ), వంటి ఎందరినో నేతలను కలిపుకొని ప్రయాణం సాగించేదుకు గట్టిగానే ప్రయత్నించారు.కానీ ఈ మద్య కేసిఆర్ దేశ రాజకీయాల్లో విపక్ష పార్టీలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
బీజేపీని గద్దె దించడమే లక్ష్యమని, అందుకోసం ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్దమే అని చెప్పిన కేసిఆర్ ఇప్పుడేందుకు సైలెంట్ అయ్యారనే చేర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మరోపైపు అంతా ఏకం అయ్యేందుకు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, కేజృవాల్ వంటి వాళ్ళు సిద్దమయ్యారు.ఈ నెల 23న పాట్నాలో సమావేశం కానున్నారు.అయితే ఈ సమావేశానికి కేసిఆర్ హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఎందుకంటే ఈ బేటీ హాజరయ్యే నేతల విషయంలో కేసిఆర్ పేరు ఎవరు ఎక్కడ ప్రసాతవించలేదు.తమిళనాడు సిఎం స్టాలిన్ ఈ బేటీకి హాజరవుతారని ప్రకటించిన విపక్షాలు.
కేసిఆర్ పేరును మాత్రం ప్రస్తావించలేదు.దీంతో కేసిఆర్ ను విపక్ష పార్టీలు దూరం పెడుతున్నాయా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఎందుకంటే కేసిఆర్ అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నేతగా మంచి పేరుంది.

అంతే కాకుండా ఆయన చతురతతో రాజకీయాలను అనూహ్యంగా మలుపు తిప్పే సామర్థ్యం ఉండడంతో కేసిఆర్ లీడ్ లోకి వస్తే ప్రతిపక్షాల తరుపున ఉన్న నేతలో షాడో లోకి వెళ్లిపోవడం కష్టమనే భావన విపక్ష నేతలలో ఉండే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం.అయితే మరికొందరి వాదన మరోలా ఉంది.కేసిఆర్ అధ్యక్షతన మోడి టార్గెట్ గా మరో ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ఆయన సిద్దమౌతున్నారని, అందుకే ప్రధాని పదవే టార్గెట్ గా ఉన్న కేసిఆర్.
వ్యూహాత్మకంగానే దూరంగా విపక్షలకు దూరంగా ఉంటూ వస్తున్నారనేది కొందరు చెబుతున్నా మాట.మరి ముందు రోజుల్లో కేసిఆర్ తో కలిసేది ఎవరు? లేదా కేసిఆరే విపక్షాలతో కలుస్తారా ? అనేది చూడాలి.
