ఇలా చేసే ముందు జాగ్రత్త.. ప్రాంక్ చేశాడనే కోపంతో ఎత్తి నదిలో పడేశాడు!

ప్రస్తుతం ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఉంది.నిత్యం సోషల్ మీడియాలో ప్రజలు గంటల తరబడి గడుపుతున్నారు.

చాలా వీడియోలను చూస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.కొన్ని వీడియోలను ప్రజలను ఆకట్టుకుంటాయి.

ఇలాంటి వాటిలో ప్రాంక్ వీడియోలు( Prank videos ) ఎక్కువగా నెటిజన్లను అలరిస్తున్నాయి.అయితే ప్రాంక్‌ వీడియోల పేరుతో చాలా మంది ఇతరులకు అసౌకర్యం కలిగిస్తున్నారు.

ఈ ఫన్నీ వీడియోలకు భారీగా వ్యూస్ వస్తుంటాయి.దీంతో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసి చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు భారీగా సంపాదిస్తున్నారు.

Advertisement
Be Careful Before Doing This He Got Angry And Threw It In The River , Viral New

అయితే ప్రాంక్ వీడియోల విషయంలో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.కొందరు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు.

ఇతరులను ప్రాంక్ వీడియోల కోసం విసిగిస్తుంటారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతుంటారు.

ఇక ఇలా తనపై ప్రాంక్ వీడియో చేసిన యువకుడిని ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు.మరోసారి ఇలాంటి పనులు చేయకుండా బుద్ధి చెప్పాడు.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Be Careful Before Doing This He Got Angry And Threw It In The River , Viral New
షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

పిచ్చి వాడి వేషం వేసుకుని రోడ్డుపై నిల్చుంటారు కొందరు.ఇలా ప్రాంక్ చేసి ఇతరులను భయపెడుతుంటారు.ప్రజల రియాక్షన్ చూసి నెటిజన్లు నవ్వుకుంటారు.

Advertisement

అయితే ఆ సమయంలో వీడియోలో కనిపించిన వారికి భయం వేస్తుంటుంది.ఇక కొందరైతే రోడ్డుపై నిల్చున్న వారి చెవిలో బూరతో పీప్ పీప్ అని అకస్మాత్తుగా గట్టిగా ఊదుతారు.

గుండె బలహీనంగా ఉన్న వారు అయితే ఇలాంటి పనులకు చనిపోయే ప్రమాదం ఉంది.ఇదే కోవలో వంతెన వద్ద నిలబడ్డ వ్యక్తికి వద్దకు ప్రాంక్ వీడియోలు చేసే యువకుడు వెళ్లాడు.

అవతలి వ్యక్తి వంతెనపై నిల్చుని ఎటో చూస్తూ సీరియస్‌గా ఇంకేదో ఆలోచిస్తున్నాడు.

అతడిపై ప్రాంక్ వీడియోలు చేసే యువకుడు బూర ఊదాడు.దీంతో చిర్రెత్తుకు రావడంతో ప్రాంక్ వీడియోలు చేసే యువకుడిని ఆ వ్యక్తి పైకి ఎత్తి నదిలో విసిరేశాడు.మరొకరు అయితే తిట్టి ఊరుకునే వారు.

అయితే ఆ వ్యక్తి మాత్రం ప్రాంక్ వీడియోలు చేసిన వారికి తగిన గుణపాఠం నేర్పాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో( Social media ) బాగా వైరల్ అవుతోంది.

ప్రాంక్ వీడియోల పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించే వారికి ఈ వీడియో కనవిప్పు కలిగిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు