డెంగీ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్.. మరీ ఇంత నిర్లక్ష్యమా!

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.డెంగీ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్‌ను సరఫరా చేశారు.

దీంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది.అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రయాగ్‌రాజ్‌లోని ఓ ఆస్పత్రిలో జాయిన్ అయ్యాడు.

అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడి ప్రాణం పోయిందని ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఎక్కించడంతో బాధితుడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

Advertisement
Battai Juice Instead Of Plasma For A Dengue Patient Is It So Careless , Uttar Pr

ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వేదాంక్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేశాడు.

బ్లడ్ ప్యాక్‌లో బత్తాయి జ్యూస్ కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.ప్రయాగ్‌రాజ్‌లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రిలో స్కామ్ జరుగుతోందని ఓ వ్యక్తి ఆరోపించాడు.

ఆస్పత్రితో సంబంధం ఉన్న వైద్యులు బ్లడ్ ప్లాస్మా అవసరం ఉన్న రోగులకు బత్తాయి జ్యూస్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.బత్తాయి జ్యూస్ ఎక్కించడం వల్ల ఆ రోగి చనిపోయాడని, దీనిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

Battai Juice Instead Of Plasma For A Dengue Patient Is It So Careless , Uttar Pr

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతోందనే ఆరోపణపై దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసినట్లు ప్రయాగ్‌రాజ్ ఐజీ రాకేశ్ సింగ్ తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
'ఏయ్ పోలీస్ ఇలారా'.. స్టేజ్‌పై పోలీసుపై చేయి చేసుకున్న కర్ణాటక సీఎం.. వీడియో వైరల్..

నకిలీ ప్లాస్మా పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.ఈ క్రమంలో పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.అయితే జ్యూస్ సరఫరా ఎలా చేయబడిందనే కోణంలో పోలీసులు ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు