పెళ్లి భరాత్ లో డాన్స్ దుమ్ములేపిన బర్రెలక్క వీడియో వైరల్!

బర్రెలక్క ( Barelakka ) పరిచయం అవసరం లేని పేరు ఈమె సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు.సోషల్ మీడియా వేదికగా తాను డిగ్రీ పూర్తి చేశాను అయినా ఎలాంటి జాబ్ రాలేదని అందుకే బర్రెలు కాసుకుంటూ ఉన్నానంటూ ఒక వీడియోని షేర్ చేశారు.

 Barrelakka Marriage Celebrations Video Goes Viral , Barrelakka, Marriage Celebra-TeluguStop.com

ఇక ఈ వీడియో ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకోవడంతో ఒకసారిగా ఈమె పాపులర్ అయ్యారు.అప్పటినుంచి బర్రెలక్క అలియాస్ శిరీష ( Shirisha ) తరచూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈమె ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇలా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో ఒక్కసారిగా ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బర్రెలక్క పెద్దగా ఓట్లను గెలుచుకోలేక ఓటమిపాలయ్యారు.ఇలా ఈమె ఓటమిపాలైనప్పటికీ ఎన్నికలలో పోటీ చేయడంతో ఒక్కసారిగా ఈమె ఎంతో పాపులర్ అయ్యారు.

ఎమ్మెల్యే ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ తాను ఎంపీ ఎన్నికలలో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను అంటూ ఇటీవల బర్రెలక్క తెలియజేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా ఇటీవల ఈమె పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి వెంకటేష్( Venkatesh ) అనే అబ్బాయితో ఈమె 7 అడుగులు నడిచారు ఇలా తన పెళ్లికి( Marriage ).సంబంధించిన అన్ని వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉండేవారు.

ఇకపోతే పెళ్లి తర్వాత నిర్వహించినటువంటి భారత్ లో తన చుట్టాలతో కలిసి ఈమె అద్భుతమైనటువంటి డాన్స్ చేస్తూ సందడి చేశారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా శిరీష డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఒక చిన్న వీడియోతో ఈమె సెలబ్రిటీగా మారిపోవడమే కాకుండా ఎన్నికలలో పోటీ చేసి రాజకీయ నాయకురాలిగా కూడా గుర్తింపు పొందుతున్నారు.

మరి ఈ ఎన్నికలలో అయినా బర్రెలక్క అనుకున్న విధంగా గెలుపు సాధిస్తారా లేకపోతే పోటీ చేయాలనే ఆలోచనను ఏమైనా విరమించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube