నిన్న మొన్నటి వరకు పోటీ చెయ్యడానికి అభ్యర్థులు కరువయినట్టుగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ( Congress party )తెలంగాణలో ఇప్పుడు కిక్కిరిసిపోయింది ముఖ్యంగా భాజపా బలహీనపడటం ప్రధాన పోటీ అధికార బారాస- కాంగ్రెస్ ల మధ్యే అన్నట్లుగా పరిస్తితి మారిపోవడంతో ఇప్పుడు బారాస వ్యతిరేకులందరికి కాంగ్రెస్ వేదికగా మారింది. కేసీఆర్( CM Kcr ) వ్యతిరేక వర్గానికి ప్రభుత్వంలోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ నిలయం గా మారింది దాంతో ఇప్పుడు కాంగ్రెస్ లోని టికెట్లకు యమా డిమాండ్ ఏర్పడింది.
ప్రతి అసెంబ్లీ స్థానానికి మూడు నుంచి నలుగురు అభ్యర్ధులు పోటీ పడడంతో ఒకరికి టికెట్ ఇస్తే మిగతా ముగ్గురు తిరుగుబాటు జెండా ఎగరవేసే అవకాశం కనిపిస్తుంది .కార్పొరేషన్ చైర్మన్లు వివిధ ప్రత్యామ్నాయ ఏర్పాట్లును కాంగ్రెస్ హామీ ఇస్తున్నప్పటికీ అవి కూడా పరిమిత సంఖ్యలో ఉండడంతో ఇప్పుడు మిగతా వారిని ఎలా అకామిడేట్ చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.ఇప్పుడు కాంగ్రెస్( Congress party ) రెబల్ అభ్యర్థులపై అధికార బారాశా కన్ను పడింది.ముఖ్యంగా చెప్పుకోదగ్గ ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి చేర్చుకొని కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రోత్సహించాలని బారతీయ రాష్ట్ర సమితి వ్యూహం పన్నినట్టుగా తెలుస్తుంది
దానికి తగ్గట్టే ప్రతి నియోజకవర్గంలోనూ టికెట్ దక్కని నేతలను పార్టీలోకి చేర్చుకునే విధంగా పావులు కదుపుతుంది .దేవరకొండ, మెదక్ మల్కాజ్గిరి వంటి స్థానాలలో కాంగ్రెస్ టికెట్లు అనధికారికంగా కన్ఫామ్ అయిపోవడంతో ఇప్పుడు అక్కడ టికెట్ దక్కని అభ్యర్థులపై బారాస స్పెషల్ ఫోకస్ పెట్టింది .వారికి వివిధ పదవులు ఆశ చూపి ఆ నాయకులకు వ్యతిరేకంగా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.ఇప్పటికే ఆయా నాయకులతో బారాశ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )చర్చలు జరుపుతున్నారు.అదే విధంగా బారాస లోని అసంతృప్తులు కొందరు పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండగా అధిష్టానం వారిని కూడా బుజ్జగించే ప్రయత్నం చేసి పార్టీతో నిలబడేలా చేయగలిగింది.
ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వెలుపడితే అసంతృప్తి నేతలు భారీ ఎత్తున వ్యతిరేక స్వరం వినిపించే అవకాశం కనిపిస్తుంది.మరి రెబల్ అభ్యర్థులను కాంగ్రెస్ ( Congress party )ఎలా కాపాడుకుంటుందో చూడాలి లేకపోతే కాంగ్రెస్ ఆశిస్తున్న అధికారం అందని ద్రాక్షే అవుతుంది.