బ్యాంక్స్ కొత్త రూల్స్: రూ.20 ల‌క్ష‌ల డిపాజిట్, విత్‌డ్రాకు ఇకనుండి పాన్ కార్డు ఉండాల్సిందే!

చిన్నవాళ్లు నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతీ ఒక్కరికీ, ప్రతీ రోజు ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఆలోచించే పరిస్థితి ఇపుడు వుంది.ఎందుకంటే రోజురోజుకీ ఆర్థిక అవసరాలు మితిమీరి పోతున్నాయి.

 Bank New Rules Pan Card Mandatory For Transactions Above 20 Lakh Rupees Details, Bank ,new Rules, 20 Lakhs, Deposit, Withdraw, New Rules, Pan Card , Bank New Rules, Pan Card Mandatory ,transactions Above 20 Lakh Rupees, Income Tax, Cbdt, Bank Deposits, Post Office-TeluguStop.com

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత పధకాలు, మరోవైపు పెరిగిపోతున్న ధరలు సగటు మానవుడిని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి.ఇలాంటి తరుణంలో నిత్యం ఏదో ఒక సందర్భంలో ప్రతీ ఒక్కరు బ్యాంకుకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంటుంది.

ఈ క్రమంలో మనం ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కొన్ని నియమ నిబంధనలు మారుతున్నాయన్న విషయాన్ని తప్పకుండ గ్రహించాలి.

 Bank New Rules Pan Card Mandatory For Transactions Above 20 Lakh Rupees Details, Bank ,new Rules, 20 Lakhs, Deposit, Withdraw, New Rules, Pan Card , Bank New Rules, Pan Card Mandatory ,transactions Above 20 Lakh Rupees, Income Tax, Cbdt, Bank Deposits, Post Office-బ్యాంక్స్ కొత్త రూల్స్: రూ.20 ల‌క్ష‌ల డిపాజిట్, విత్‌డ్రాకు ఇకనుండి పాన్ కార్డు ఉండాల్సిందే-Business - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా, నగదు నిర్వహణ విషయంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్టు సమాచారం.

కొత్త రూల్స్ ప్రకారం.ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా అంతకంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు నెరిపినట్లైతే మాత్రం ఖచ్చితంగా పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుందని సంబంధిత బ్యాంకులు చెబుతున్నాయి.ఆదాయం ప‌న్ను చ‌ట్టం (15వ స‌వ‌ర‌ణ‌) నిబంధ‌న‌లు-2022 కింద CBDT (కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు) ఖ‌రారు చేసింది.ఈ నెల 10వ తేదీన నోటిఫికేష‌న్ సీబీడీటీ జారీ చేయగా.2022 మే 26వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి రానున్నాయని CBDT వెల్ల‌డించింది.

Telugu Lakhs, Bank, Bank Deposits, Cbdt, Deposit, Tax, Pan, Pan Mandatory, Rupees, Withdraw-General-Telugu

ఇక రూ.50వేల లోపు ఏదైనా లావాదేవీ జరిగితే మాత్రం పాన్ కార్డు అవసరం ఉండదు.కానీ, రూ.50వేలు ఆపైనా బ్యాంకింగ్ లావాదేవీలు జరిపితే మాత్రం పాన్ కార్డు తప్పనిసరి.అయితే ఆర్థిక సంవత్సరంలో బ్యాకింగ్ లేదా స‌హ‌కార బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో ఎక్కువ అకౌంట్లలో రూ.20 ల‌క్ష‌లు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే ఇకపై పాన్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది.రూ.20 లక్షలు లేదా అంత‌కంటే ఎక్కువ విత్ డ్రా చేసినా కూడా పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే.ఏదైనా ఇతర స‌హ‌కార బ్యాంక్ లేదా పోస్టాఫీసులో కరెంట్ అకౌంట్ లేదా క్యాష్ క్రెడిట్ అకౌంట్ తెరిస్తే.అప్పుడు కూడా తప్పనిసరిగా పాన్ కార్డు స‌మ‌ర్పించాలి ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube