చంద్రబాబు అక్రమ అరెస్టకు నిరసనగా బెంగళూరు ఐటీ ఉద్యోగులు..!!

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.స్కిల్ డెవలప్మెంట్ ( Skill development )కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

 Bangalore It Employees Protest Against Chandrababu's Illegal Arrest , Tdp, Banga-TeluguStop.com

దీంతో ఆయనను అరెస్టు చేసిన విధానం చాలా తప్పు అని వైసీపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయి నేతలు సెలబ్రిటీలు కామెంట్లు చేస్తున్నారు.మరోపక్క రాజకీయ కక్షతోనే చంద్రబాబుని ఎన్నికల ముందు అరెస్టు చేయించారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

ఇదే సమయంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు( Telugu Desam Party ) నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఒక ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు చంద్రబాబు అక్రమ అరెస్ట్ అంటూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు( IT employees ) సైతం నిరసనలు చేపట్టారు.

తాజాగా ఇప్పుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం జరిగింది.చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ఫ్రీడం పార్కు వద్ద బెంగళూరు ఐటి ఎంప్లాయిస్ నినాదాలు చేశారు.“బాబుతో నేను” అంటూ ప్లకార్డులు పట్టుకొని.నిరసన తెలియజేయడం జరిగింది.

ఇందుకు సంబంధించిన వీడియోను తెలుగుదేశం ట్విట్టర్ తాజాగా షేర్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube