పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే బాక్స్ బద్దలే.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్!

పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబినేషన్ లో తీన్ మార్, గబ్బర్ సింగ్ సినిమాలు తెరకెక్కగా తీన్ మార్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను అందుకుంది.పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 Bandla Ganesh Tweet Viral In Social Media Details Here ,  Bandla Ganesh, Shockin-TeluguStop.com

అయితే తాజాగా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్ భక్తుడు అనే సంగతి తెలిసిందే.

గబ్బర్ సింగ్ షూట్ సమయంలో దిగిన ఫోటోను షేర్ చేసిన బండ్ల గణేష్ నా దైవ సమానులైన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేసే సినిమాను త్వరగా తీయాలని మానస్పుర్తిగా కోరుకుంటున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ ను అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ ను ప్రేమిస్తూ పవన్ ప్రేమను పొందుతూ సినిమా తీస్తే బాక్స్ బద్దలే అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

బింబిసార, సీతారమం సినిమాల ఫలితాల గురించి బండ్ల గణేష్ స్పందిస్తూ మంచి సినిమాలు తీశారని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని అన్నారు.మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

బండ్ల గణేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.బండ్ల గణేష్ ప్రస్తుతం పవన్ గురించి ఎందుకు పోస్ట్ పెట్టారో అర్థం కావడం లేదని నెటిజన్లు చెబుతున్నారు.

బండ్ల గణేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.అయితే బండ్ల గణేష్ సినిమాలను నిర్మిస్తారో లేదో తెలియాల్సి ఉంది.మరోవైపు పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యల వల్ల బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నారు.ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ తో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube